Husband And Wife Relationship: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది. సంసార జీవితంలో మనకు ఎదురయ్యే వాటిని పరిష్కరించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆలుమగల మధ్య అనుబంధాన్ని పెంచే క్రమంలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదని చెబుతుంటారు. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే దంపతుల మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండకూడదని చెబుతుంటారు. ఇందులో భాగంగానే అన్ని విషయాలు భార్యతో పంచుకోవాలని లేదు. కొన్నింటిని దాచుకోవడమే మంచిది. లేదంటే భాగస్వామి దగ్గర చులకనగా మారే అవకాశముంది.

పెళ్లికి ముందే కొందరికి పలు లైంగిక సంబంధాలు ఉంటాయి. కానీ వాటిని జీవిత భాగస్వామితో చర్చించకపోవడమే శ్రేయస్కరం. పొరపాటున మన వ్యక్తిగత జీవితం గురించి నిజాలు చెబితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో దాంపత్య జీవనంలో ఇబ్బందులు లేకుండా చేసకోవాలంటే మన రహస్యాలు ఎప్పటికి కూడా చెప్పకపోవడమే బెటర్. జీవిత భాగస్వామికి చెప్పకపోవడంలో ఎలాంటి తప్పు లేదని తెలుసుకోవాలి. ఒకవేళ చెబితే మీ మధ్య దూరం పెరుగుతుంది.
వివాహానికి ముందు ఎన్నో అలవాట్లు ఉంటాయి. అన్నింటిని అందరి ముందు ప్రదర్శించడం వీలు కాదు. అలాంటి వాటిని కూడా భార్యతో చెప్పడం సరైంది కాదు. దాంపత్య జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. చిన్న చిన్న అనుమానాలు రావడం సహజం. వాటిని జీవిత భాగస్వామితో పంచుకోవడం కరెక్టు కాదు. రహస్యాలు బయట పెట్టడం వల్ల పలు సమస్యలకు మూలం అవుతుంది. చాలా మందికి వివాహ బంధానికంటే ముందు ఎన్నో అనుభవాలు ఉన్నా వాటిని గురించి ఎక్కడ కూడా చర్చించకూడదు.

ప్రస్తుతం భాగస్వామికి చెబితే మాత్రం దాని వల్ల ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇక జీవితాంతం మీపై చెడు ప్రభావమే ఉంటుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇంతకన్నా గొప్ప అనుభవం గతంలో అనుభవించానని ఎప్పుడో ఒకప్పుడు చెబితే దాని వల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. భార్యలో కూడా కొన్ని నచ్చని అంశాలు ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు కూడా బయటపెట్టొద్దు. కుటుంబ సభ్యుల గురించి కూడా ఎప్పుడు డిస్కషన్ చేయడం సురక్షితం కాదు. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితం గురించి వివరించాల్సిన అవసరం ఉండదు.