Character of Those Who Wear These Colorful Dresses: ఒక మనిషి అందంగా కనిపించాలంటే అతని రూపం బాగుండాలంటారు. కానీ ఒక్కసారి రూపం ఎలా ఉన్నా.. వారు ధరించే దుస్తులతో ఆకట్టుకునే విధంగా కనిపిస్తారు. అందుకే చాలా మంది డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆడవారు అయితే నచ్చిన డ్రెస్ కోసం సమయాలు, రోజులు తెలియకుండా షాపింగ్ చేస్తారు. అయితే డ్రెస్ మోడల్ ఎలా ఉన్నా కళ్లకు ఇంపుగా ఉండే కలర్ ఉంటే బాగుంటుంది. ఈనేపథ్యంలో కొందరు రాయల్ కలర్స్ ను ఎంచుకుంటారు. మరికొందరు మాత్రం కలర్ తో సంబంధం లేకుండా డిజైన్ బాగుండేలా చూసుకుంటారు. కానీ ఒక్కో కలర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దీనిని క్లాత్ సైకాలజీ అని అంటారు. దీంతో డ్రెస్సింగ్ వేసే సమయంలోనూ ఎంచుకున్న కలర్ ను బట్టి వారి క్యారెక్టర్ ను గుర్తించవచ్చని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వారు వేసుకున్న డ్రెస్ కలర్ తో వారు ఎలాంటి విజయాలు సాధిస్తారో తెలుసుకోవచ్చు.. అదెలాగంటే?
కొంత మందికి రంగు రంగుల డ్రెస్సులు వేయడం అంటే చాలా ఇష్టం. మరికొందరు మాత్రం వైట్ డ్రెస్ లు ఎక్కువగా ధరిస్తారు. తెలుపు రంగు అనేది ప్రశాంతతకు చిహ్నం. ఇలాంటి డ్రెస్సులు ఎక్కువగా ధరించేవారు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోకుండా చెప్పేస్తారు. వీరు ఎప్పటికీ ప్రశాంతంగా కనిపిస్తారు. ఒక పనినిపూర్తి చేసే క్రమంలోనూ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా శాంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
కొంత మంది నలుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. నలుపు అశుభం అని కొందరు అనుకుంటున్నా.. ఇది పవర్ ఫుల్ అని కొందరు భావిస్తారు.ఇది ఎక్కువగా ధరించే వారు నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఒక పనిని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్తారు. వీరిలో నిత్యం ఎనర్జీ పవర్ రన్ అవుతూ ఉంటుంది. పనులు చేయడంలో వీరు చురుగ్గా ఉంటారు.ఇది ధరించిన వారు ఎదుటి వారికి స్ట్రాంగ్ గా కనిపిస్తారు. ఇంటలీజెంట్ అన్న భావన కలుగుతుంది.
నీలి రంగును పాజిటివ్ కలర్ గా భావిస్తారు. ఈ కలర్ డ్రెస్ వేసుకున్న వారు ప్లాన్డ్ గా ఉంటారు. వీరు ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు. ఒక ప్రాజెక్టును చేపడితే దాని కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తారు. అంతేకాకుండా హుందాగా కనిపించాలంటే నీలిరంగా దుస్తులు ఎక్కువగా ధరిస్తారు.
పసుపు రంగును శుభసూచికంగా భావిస్తారు. దీంతో పసుపు రంగు దుస్తులు వేసుకున్న వారు పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్తారు. అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలాంటి దుస్తులు ధరిస్తారు. అంతేకాకుండా ఇవి ధరించిన సమయాల్లో సంతోషంగా ఉంటారు.
ఎరుపు రంగును డేంజర్ కు సిగ్నల్ గా భావిస్తారు. కానీ ఈ రంగు డ్రెస్ వేసుకున్న వారు ఎనర్జిటిక్ గా ఉంటారు. వీరు కాన్ఫిడెంట్ తో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఈ రంగు డ్రెస్ వేసుకున్న వారు చూడ్డానికి అట్రాక్టివ్ కనిపిస్తారు. అయితే పరిస్థితులను భట్టి ఆయా రంగుడ డ్రెస్సులు ధరించడం వల్ల విజయం సాధిస్తారు.