https://oktelugu.com/

Biggest Mistake: మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా..?

సాధారణంగా పాదాలు నేలపై ఉండాలి.. కళ్లు ఆకాశాన్ని చూడాలని పెద్దలు చెబుతుంటారు. దీనికి కారణం మన మీద మనకు నమ్మకాన్ని బలపరచడం కోసం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 30, 2024 12:53 pm
    Biggest Mistake

    Biggest Mistake

    Follow us on

    Biggest Mistake: మనలో చాలా మంది ఆత్మవంచనకు పాల్పడుతుంటారన్న సంగతి తెలిసిందే. పరిస్థితుల ప్రభావం కావొచ్చు మరే ఇతర కారణమైనా కావొచ్చు.. కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితిలో ఆత్మవంచన, స్వీయ వంచన చేసుకోవడం జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు అని చెప్పుకోవచ్చు.

    సాధారణంగా పాదాలు నేలపై ఉండాలి.. కళ్లు ఆకాశాన్ని చూడాలని పెద్దలు చెబుతుంటారు. దీనికి కారణం మన మీద మనకు నమ్మకాన్ని బలపరచడం కోసం. కానీ చాలా మంది ఎదుటివారి కంటే ముందు మనమే మనల్ని తక్కువగా చేసుకుంటాం..మోసం చేసుకుంటాం. ఈ విధంగా మన మీద మనకే నమ్మకం లేకపోతే జీవితంలో మనల్ని నమ్మేవారే ఎవరూ ఉండకపోవచ్చు. అంతేకాదు యావత్ ప్రపంచం అంత కలిసి నిన్ను తొక్కుకుంటూ వెళ్తుంది. మోసం చేస్తుంది.

    బంధాలను కాపాడుకోవడం కోసం, ఆందోళనను తగ్గించుకోవడం కోసం, పరిస్థితులకు తలొగ్గి అబద్ధం చెప్పడం కోసం ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటాం. లేదా ఆశావాదం, ఆత్మవిశ్వాసం వంటి వాటి వలన కూడా కొన్ని సార్లు స్వీయ వంచన చేసుకోవాల్సి వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మనలోని భావాలు కానీ భావోద్వేగాలు కానీ దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కూడా మనకు తెలియకుండానే అబద్ధాలు చెప్పుకుంటాం.

    అయితే ఇది సరికాదని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు. పరిస్థితులను దాటుకుంటూ.. మనల్ని మనం బలపరుచుకోవాలి. మానసికంగా సమస్యలను నిజాయితీగా ఎదుర్కొనే విధంగా సన్నద్ధం కావాలి. స్వీయ వంచనకు పాల్పడకుండా ఉండేందుకు ధృడంగా ఉండాలని చెబుతున్నారు. మనల్ని మనం మోసం చేసుకుని ఎదుటివారికి మనల్ని మోసం చేసే అవకాశాలను ఇవ్వకూడదు. మనమీద మనకు నమ్మకం ఉంటే సమస్య ఏదైనా ధైర్యంగా ఎదుర్కొగలం.. అంతేకాదు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైన చక్కబెట్టుకుంటూ మంచి దారిలో నడవగలం. అలాగే ఎదుటి వారికి మన మీద నమ్మకాన్ని కలిగించగలమని చెబుతున్నారు.