MLA Hafeez Khan: రెండేళ్ల తర్వాత ఏపీ నుంచి వైఎస్సార్ సీపీ తరఫున కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ పాషాను రాజ్యసభకు పంపుతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. లక్షల మంది సాక్షిగా ప్రకటించారు. తన మనసులో ఏ కల్మషం లేదు కాబట్టే ప్రకటిస్తున్నానని కూడా తెలిపారు. ఇక కర్నూల్ ఎమ్మెల్యే టికెట్‌ను మరో మైనారిటీ అయిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను రాజీనామా చేయించి మరీ పోటికి నిలబెట్టింది. దీంతో హఫీజ్‌పాషా నొచ్చుకోకుండా రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపుతున్నానని తెలిపారు. చెప్పానంటే చేస్తానని వెల్లడించారు. విభేదాలు, అసంతృప్తి కారణంగా ఇలా హఫీజ్‌కు స్పష్టత ఇచ్చారు.
అలీ పరిస్థితి ఏంటి..
ఇక మైనారిటీ కోటాలో అలీని రాజ్యసభకు పంపుతారని మూడు నాలుగేళ్లుగా ప్రచారం జరిగింది. కానీ, రాజ్యసభ పదవి రాలేదు. నామినేటెడ్ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో నంద్యాల నుంచి బరిలో దింపుతారని భావించారు. కానీ అదీ జరుగలేదు. దీంతో రాజ్యసభకు అలీ వెళ్లడం ఖాయమని అంతా భావించారు. కానీ, ఇప్పుడు మైనారిటీ కోటా విషయంలో జగన్ హఫీజ్ పాషాకు హామీ ఇవ్వడంతో ఇప్పుడు అలీ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండస్త్రీ నుంచి మద్దతుగా నిలిచి..
ఇక అలీ సినిమా ఇండస్త్రీ అంతా ఒకవైపు ఉంటే.. ఆయన మాత్రం వైఎస్సార్‌సీపీకి మొదటి నుంచి అండగా నిలిచారు. వైసీపీకి మద్దతు తెలిపిన కొద్ది మంది ఇండస్ట్రీవాళ్లలో అలీ మొదటి వరుసలో ఉంటారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. దీంతో అలీకి మంచి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు మైనారిటీ కోటా రాజ్యసభ సీటు అభ్యర్థి ఖరారు చేయడంతో అలీని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. మరి అలీకి జగన్ ఎలా న్యాయం చేస్తారో చూడాలి.