Social Media: ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోయింది. యువత సెల్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియా ఓ వ్యసనంలా మారింది. లైకులు, కామెంట్లతోనే కాలం గడుపుతున్నారు. దీంతో మానసిక ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాకు అప్పుడప్పుడు విరామం ఇస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈనియమాలు ఎవరు పాటించడం లేదు. ఇరవై నాలుగు గంటలు స్మార్ట్ ఫోన్ తోనే సరదాలు తీర్చుకుంటున్నారు. ఫోన్ల వల్ల చాలా మందిలో పలు సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు.

సోషల్ మీడియాలో సినిమాలు చూస్తున్నారు. యూట్యూబ్ లో పలు కార్యక్రమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరుగుతున్నా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఈ సమస్య డిప్రెషన్ కు దారితీస్తుందని తెలిసినా లెక్క చేయడం లేదు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాలు పక్కదారి పట్టిస్తుంటాయి. కొన్నింటిని ప్రజలను అనవసరమైన విషయాలపై ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. వీటితో జాగ్రత్తగా ఉండాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని అన్నింటిని నమ్మి మోసపోవద్దు.
సోషల్ మీడియాకు రోజులో కొంతసేపైనా విరామం ఇవ్వకపోతే సమస్యలొస్తాయి. ఒత్తిడికి కారణమవుతుంది. డిప్రెషన్ కలగడం ఖాయం. దీంతో మనం ఫోన్ ను కొంత సమయమైనా పక్కన పెట్టేయాలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మనకు రిలాక్స్ కలుగుతుంది. కేవలం సామాజిక మాధ్యమాలను నమ్ముకునే చాలా మంది మోసపోతున్నారు. వాటి కంటే విలువైనవి చాలా ఉన్నాయి. దానికి దూరంగా ఉంటే మనకు ఇతర విషయాల మీద కూడా కాస్త శ్రద్ధ పెరుగుతుంది.
గంటల కొద్ది సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయేకంటే ఒంటరిగా కొన్ని కొత్త ప్రదేశాలు సందర్శించడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకునేందుకు చొరవ చూపాలి. కొత్త అనుభూతులు పొందడం వల్ల మనసుకు ఎంతో ఉత్తేజం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కూడా కాలం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. వారితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే బంధాలు కూడా బలపడతాయి. ఎంతసేపు ఫోన్లతో ఉండేకంటే ఇలా చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కాకుండా మనకు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న వారితో సమయం గడిపేందుకు సమయం కేటాయించుకోండి. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకోవచ్చు. దీని వల్ల మనలో కొత్త ఆశలు రేకెత్తుతాయి. ఉత్సాహం ఉరకలేస్తుంది. సోషల్ మీడియాకు సమయం ఇచ్చే బదులు మన కెరీర్ ను ఉన్నతంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎంతో లాభం కలుగుతుంది. ఏదైనా క్రీడను ఎంచుకుంటే క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతాయి.