Dry Fruits Benefits: ప్రస్తుతం అందరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మితిమీరిన ఆహార అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల అధిక బరువు మనల్ని వెంటాడుతోంది. తగిన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఒత్తిడి వల్ల కూడా అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో అధిక బరువు ఓ గుదిబండలా మారుతోంది. చాలా మంది ఊబకాయ బాధితులుగా మారుతుండటం సహజం.
ఆహార అలవాట్లు
ప్రస్తుతం చాలా మంది జంక్, బేకరీ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. దీంతో అధిక బరువు ముప్పును ఎదుర్కొంటున్నారు. కూల్ డ్రింక్స్ దూరంగా ఉండటమే మంచిది. పోషకాలు ఉన్న ఆహార అలవాట్లు చేసుకుంటేనే ప్రయోజనం. నీటిలో నానబెట్టిన వాటిని తింటే బరువు తగ్గుతామని తెలుసుకోవాలి. అలాంటి వాటిని తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో..
రోజు ఉదయం ఖాళీ కడుపుతో మనం ఏం తిన్నా త్వరగా జీర్ణం అవుతుంది. ఉదయం పూట నీళ్లు తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి నానబెట్టిన వాటిని ఉదయం తినడం వల్ల మంచి లాభాలుంటాయి. నానబెట్టిన వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువును నియంత్రణలో ఉంచడానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి.
బాదం తినడం వల్ల
రాత్రి నానబెట్టిన బాదం తింటే బరువు తగ్గుతారు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బాదంను ఉదయం నిద్ర లేచిన తరువాత తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. కిస్మిస్లు కూడా రాత్రి నానబెట్టి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ను రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంజీర పండ్లు తింటే..
అంజీర పండ్లు రెండు లేదా మూడు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి పండ్లను తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కడుపులో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసే ఆహారాల్లో వీటిని చేర్చుకోవడం మంచిది. వీటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఊబకాయం సమస్య నుంచి దూరం కావొచ్చు.