Egg Health Benefits: చలికాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో శరీరం పలు రోగాలకు నిలయంగా మారుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటివి బాధిస్తుంటాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇబ్బందులు రావడం సహజమే. ఫలితంగా ఎముకల్లో నొప్పి రావడం కామనే. ఈ నేపథ్యంలో రోజుకు ఓ కోడిగుడ్డు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్ లో కోడిగుడ్డు తినడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శీతాకాలంలో రోజుకు ఒక గుడ్డు తింటే ఎంతో మేలు. దీంతో మన ఆరోగ్యం కుదుటపడుతుంది.

గుడ్డు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్లు బి6, బి12 ఉండటంతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల విటమిన్ డి, జింక్ కూడా అధికంగా లభిస్తుంది. ఇది మన శరీరంలో లుటిన్, జియాజంతిన్ అనే సమ్మేళనాలు ఉండటంతో ఎముకలు బలంగా అవుతాయి. కీళ్లనొప్పులు, ఎముకల నొప్పుల నుంచి బయటపడొచ్చు. కోడిగుడ్లు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు దాగి ఉన్నాయి. కోడిగుడ్లు తిని ఆరోగ్యాన్ని పరిపుష్టిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ కాలంలో మనకు సూర్యరశ్మి సరిగా అందదు. దీంతో విటమిన్ డి లోపం వచ్చే అవకాశముంది. కోడిగుడ్డు రోజు తినడం వల్ల ఈ లోపం రాకుండా చూసుకుంటుంది. కోడిగుడ్డులో రోజుకు మనకు కావాల్సిన డి విటమిన్ 82 శాతం ఉంటుందని చెబుతున్నారు. రోజు కోడిగుడ్డు తింటే విటమిన్ డి లభించడం ఖాయం. దీంతో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. రోజు కోడిగుడ్డు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఉడకబెట్టిన గుడ్డులో దాదాపు 0.6 మైక్రో గ్రాముల మేర విటమిన్ బి12 ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 25 శాతం కోడిగుడ్డు తినడం వల్ల వస్తుంది. విటమిన్ బి12ను కూడా తిరిగి పొందవచ్చు. రక్తం బాగా తయారు కావడానికి ఇది దోహదపడుతుంది. కోడిగుడ్డులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. నాడీ మండల వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కోడిగుడ్డు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. రోజు ఒక గుడ్డు తిని మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.