Hot Water Benefits: ప్రతి రోజు ఉదయం వేడినీరు తాగితే మంచిదే. దీన్ని వైద్యులు కూడా చెబుతున్నారు. మనమే నిర్లక్ష్యంతో ఆచరించడం లేదు. దీంతో పలు రకాల రోగాల బారిన పడుతున్నాం. అయినా మనలో మేల్కొలుపు రావడం లేదు. మగవారు అయితే రోజుకు ఐదు లీటర్లు, ఆడవారు నాలుగు లీటర్ల నీరు రోజు తాగుతుండాలి. అప్పుడే మన శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. వ్యర్థాలు మూత్రం, మలం ద్వారా బయటకు వెళితేనే మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే వేడి చేసిన నీటిని తాగితే ఉపశమనం కలుగుతుందని తెలుసుకోవాలి.

వేడి నీరు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా రోజు వేడినీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో రెండు మూడు చుక్కల నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. వేడినీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ కూడా నూటికి నూరు శాతం పనిచేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి.
చిన్న వయసులో చర్మం ముడతలు పడితే కూడా వేడి నీటిని రోజు తాగితే ఆ సమస్య కూడా దరిచేరదు. చర్మం పొడిబారటం, జీవం కోల్పోవడంతో కూడా మనకు చిక్కులు వస్తాయి. వాటిని తీర్చుకోవడం కూడా వేడి నీటితో సాధ్యం. నీరు తాగితే మన శరీరంలో ఉన్న వ్యర్థాలను దూరం చేసే పని సక్రమంగా జరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరగాలంటే నీరు ప్రధానమైనది. దీంతో నీరు తాగడం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనికి అందరు కచ్చితంగా నీరు తాగడం అలవాటు చేసుకోవాల్సిందే.

వేడి నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు దక్కుతాయి. రెగ్యులర్ గా తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వెచ్చని నీరుతో మన శరీరానికి ఎంతో రక్షణ చేకూరుతుంది. వేడి నీటితోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వేడి నీటిని తాగుతూ మన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు అందరు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఇన్ని లాభాలు ఉన్న వేడినీరును నిర్లక్ష్యం చేయకుండా తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.