Dates For Healthy: ప్రకృతి సిద్ధంగా మనకు పండ్లు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలతో మనకు దీర్ఘకాల సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల రోగాలు నయమవుతాయి. వీటితో తక్షణ శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో ప్రొటీన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో వీటిని తినడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చక్కెర కంటే తీపి ఉన్న వాటిలో ఖర్జురాల పాత్ర కీలకంగా మారనుంది. ఖర్జూరాల్లో ఉండే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యమే కలుగుతుంది.

నాలుగు ఖర్జూరాలను మెత్తగా చేసుకుని ఒక గ్లాస్ పాలలో వేసుకుని బాగా మరిగించాలి. అలసటగా ఉండేవారు గ్లాస్ పాలలో ఖర్జూరాలు కలిపి తీసుకుంటే శక్తి రావడం సహజమే. జీర్ణ సంబంధమైన సమస్యలు దూరం అవుతాయి. గ్యాస్, ఎసిడిటి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయనడంలో అతిశయోక్తి లేదు. జీర్ణక్రియ సాఫీగా సాగడంలో ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలతో మన అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.
ఖర్జూరాలతో కంటి జబ్బు సమస్యలు రావు. రేచీకటి సమస్య కూడా రాదు. రక్తం తక్కువగా ఉన్న వారు ఖర్జూరాలతో కలిపి పాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తం పడటమే కాకుండా రక్తహీనత సమస్య లేకుండా పోతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మంచి కొవ్వు వృద్ధి అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా అవుతుంది. జ్ణాపకశక్తి పెరుగుతుంది. ఖర్జూరాలతో మనకు ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో ఉండే బలమే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఎండు ఖర్జూరాలు కూడా ఎన్నో విధాల మేలు చేస్తుంది.

ఖర్జూరాలు మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఖర్జూరాలు ముందుంటాయి. వీటితో మనకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరాలతో మన శరీరం ఎన్నో బాధల నుంచి విముక్తి కలుగుతుంది. వీటిని తినడం వల్ల మన అవయవాలకు మేలు కలుగుతుంది. రాత్రి పూట నానబెట్టిన ఎండు ఖర్జురాలు తీసుకుంటే మనకు పలు రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు దాగి ఉన్న ఖర్జూరాలు తింటే దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ఎంతో లాభం కలుగుతుంది.