Sunday Special: శ్రీవారి దర్శనానికి పలు మార్గాలు ఉన్నాయి. కానీ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఎన్ని దారులున్నా చాలడం లేదు. భక్తుల రాక అంత రద్దీగా ఉంటోంది. దీంతో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తుల కోరిక మేరకు కొత్త కొత్త మార్గాలు నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పాత మార్గాలను సైతం సుందరీకరించే పనుల్లో పడిపోయారు. ఇన్నాళ్లు ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య ప్రయాణించిన మార్గాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దాన్ని నిర్మించాలనే సంకల్పం అధికారుల్లో వచ్చింది. దీంతో దాని నిర్మాణానికి అంకురార్పణ జరగనుంది.

ఈ మార్గం శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. అన్నమయ్య ఈ దారి గుండానే తిరుమల చేరుకున్నట్లు తెలుస్తోంది. నేరుగా తిరుమలకు చేరుకోవచ్చు. రేణికుంట మండలంలోని కరకంబాడి-లాలపల్లి మధ్యన రైల్వే మార్గానికి పశ్ఛిమ భాగంలో ఈ మార్గం ప్రారంభమవుతుంద. కడప జిల్లా వాసులు ఈ దారి గుండానే తిరుమలకు వెళుతుంటారు. ప్రభుత్వం దీని నిర్మాణానికి మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చాలా ఏళ్లుగా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈ దారి అధ్వానంగా మారింది. అటవీ దొంగలకు ఆవాసంగా మారడంతో దీని గుండా ప్రయాణించేందుకు ప్రజలు జంకుతుంటారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఘాట్ రోడ్డు నిర్మిస్తే ప్రయాణికులకు మరింత సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు సైతం చాలా ఏళ్లుగా ఈ మార్గాన్ని నిర్మించాలని వినతులు చేస్తున్నా పట్టించుకోలేదు.
అటవీ శాఖ సిబ్బంది మాత్రమే ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. కలప దొంగలను పట్టుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. దీంతో భక్తులు చాలా తక్కువగా సంచరించే మార్గాన్ని సుందకరించాలని భావించడంపై హర్షం వ్యక్తమవుతోంది. మొత్తానికి శ్రీవారి దర్శనానికి మరో దగ్గరి దారి రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు.
Also Read: వివాహం ఆలస్యం అవుతుందా అయితే ఈ చిన్న పని చేస్తే చాలు..!
1944లో మొదటి సారిగా తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించారు. అది బ్రిటిష్ కాలంలో జరిగింది. 1970లో రెండో ఘాట్ రోడ్డు నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నమయ్య మార్గం కూడా రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించడంపై భక్తులకు దూరం తగ్గనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మార్గంలో రోడ్డు నిర్మించాలని చాలా ఏళ్లుగా స్థానికులు కోరుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక పనులు నిర్వహించడమే తరువాయి అని తెలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠంగా పిలువబడుతోంది. ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. దీంతో భక్తుల కోరిక మేరకు టీటీడీ పనులు చేపట్టడం కోసం కసరత్తు చేస్తోంది. అన్నమయ్య మార్గం ఘాట్ రోడ్డుగా రూపుదిద్దుకోవడంతో సమస్యలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: వందేళ్ల మిస్టరీ.. : ఆ సొరంగంలో రైలు ఎలా మాయమైంది?