Gold: బంగారం అంటే ఇష్టం ఇప్పటిది కాదు. పూర్వ కాలం నుంచే ఉంది. మన పూర్వీకులు కూడా బంగారానికి అంత ప్రాధాన్యం ఇచ్చి దాన్ని సంపాదించేందుకు నానా తిప్పలు పడ్డారు. ఇప్పుడు మనం కూడా బంగారం సంపాదించాలని ఎన్నో కలలు కంటుంటాం. కానీ దాన్ని సాధించడం అంత సులభం కాదు. బంగారం ధర రోజురోజుకు రెట్టింపవుతోంది. డబ్బున్న వారు అయితే బంగారం కొంటారు. లేదంటే భూములు కొనుగోలు చేయడం పరిపాటే. దీంతో బంగారం గురించి అందరికి ఆసక్తి మెండుగానే ఉంటుంది.

మన శరీరంలో కూడా బంగారం ఉంటుందని ఎంత మందికి తెలుసు. ఇది బాగా విస్తృతమైతే బంగారం కోసం మనుషులను చంపే వరకు కూడా వెళ్తుందని అందరిలో ఆందోళన నెలకొంది. కానీ మనిషి శరీరంలో కూడా విచిత్రంగా బంగారం ఉంటుందట. కానీ ఎక్కడ ఉంటుందనే దానిపై ఎవరికి స్పష్టత లేదు. కాకపోతే ఎముకల్లో కొద్దిగా ఉంటుందని కొన్ని పరిశోధనలు తేల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం మనిషి లో కూడా లభిస్తుందంటే అందరు తీసుకునేందుకు ఉత్సాహ పడతారు.
బంగారం మన ఒంట్లో ఉందని తెలిస్తే చాలా మంది దాన్ని తీసుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పడం లేదని తెలుస్తోంది.
ప్రతి మనిషి తన జీవితకాలంలో ఎంతో కొంత బంగారం సంపాదించాలనే ఆశ పడుతుంటాడు. బంగారంతో తన భార్య బయటకు వెళితే తన స్థాయి పెరుగుతుందని భావిస్తుంటాడు. బంగారం దాయడమే కష్టం. బ్యాంకుల్లో పెడితే తప్ప ఇళ్లల్లో పెడితే దొంగలు పడితే అంతే సంగతి. బంగారం సొత్తు గోవిందా అవుతుంది. దీంతో బంగారం ఇంట్లో ఉంటే నిద్ర కూడా పట్టదు. ఎప్పుడు భయంతోనే గడపాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనడం వల్ల మనకు బాధలే కానీ సుఖం మాత్రం ఉండదు.

ఏదైనా విందులు, వినోదాలకు వెళ్లినప్పుడు మాత్రం ఒంటి నిండా బంగారం వేసుకుంటే బాగా డబ్బున్న వాళ్లని భావిస్తారు. సాదాసీదాగా ఉంటే పేదవాళ్లని అనుకుంటారు. అంతే తేడా. బంగారం విషయంలో అందరికి ఆసక్తి మెండుగానే ఉంటుంది. ఏదో సమయంలో బంగారం కొనుక్కుని తమ దర్పం చూపించుకోవాలని ఆశిస్తుంటారు. దాని కోసమే నిరంతరం శ్రమిస్తుంటారు. మొత్తానికి బంగారం ఉంటే విలువతో పాటు భయం కూడా వెన్నంటి ఉంటుందని గ్రహించుకోవాలి.