Lunar Eclipse Effects: ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడుతోంది. మే 5న రాత్రి 8.44 గంటల నుంచి రాత్రి 01.01 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ మేరకు వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండకపోతే కష్టాలు వస్తాయి. అందుకే వారు గ్రహణం తరువాత కొన్ని పరిహారాలు పాటించాలి.
వృషభ రాశి వారికి చంద్రగ్రహనం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. ఈ మేరకు ఈ రాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే.
వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం ఇబ్బందులు తీసుకొస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జాతకంలో ఇబ్బందులున్నందున కాస్త కుదురుగా ఉండమని చెబుతున్నారు. లేదంటే అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
మిథున రాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సమస్యలు చుట్టుముడతాయి. ధైర్యంగా ఉండకపోతే మరిన్ని సమస్యలు వస్తాయి. ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మునిగిపోతారు. దీని వల్ల చంద్రగ్రహణం నుంచి ముప్పు ఏర్పడే వీలున్నందున సమస్యలు రాకుండా చూసుకోవడమే మంచిది.
కన్యా రాశి వారికి సమస్యలు చుట్టుముడతాయి. చంద్రగ్రహణం వీరికి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తున్నాయి. ఈ రాశి వారు 15 రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున మనం కష్టాలు రాకుండా చూసుకోవాలి.