Kitchen Tips: మన శారీరక పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమే. లేకపోతే రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే మన ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో మన వంట గదిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనకు ఎన్నో లాభాలున్నాయి. వంటింట్లో పరిశుభ్రత ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. శాఖాహారమైనా మాంసాహారమైనా శుభ్రంగా కడిగితేనే మంచిది. సాధ్యమైనంత వరకు వంట గదిని ఎప్పుడు క్లీన్ గా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని తెలుసు. దీనికి అందరు చర్యలు తీసుకుని వంట గది శుభ్రతకు సహకరించాల్సిందే.

వంటగదిలో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. ఏ వస్తువును ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకు చిక్కులు తెచ్చిపెడతాయి. ఇల్లు తుడిచే స్పాంజిని తరుచూ మారుస్తుండాలి. ఎక్కువ రోజులు ఒకే స్పాంజిని వాడితే వంట గది శుభ్రం కాదు. ఇంకా దాంతో ఎక్కువ నష్టమే కలుగుతుంది. అప్పుడప్పుడు స్పాంజిని మారుస్తూ ఉంటే పరిశుభ్రత సాక్షాత్కరిస్తుంది. వంట గది పరిశుభ్రత మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
ఇంట్లోకి సామన్లు తీసుకొచ్చిన రీసైక్లింగ్ బ్యాగులను ఇంట్లో ఉంచుకోకూడదు. వాటి ద్వారా మనకు అనర్థాలే చోటుచేసుకుంటాయి. బ్యాగుల్లో వస్తువులు తీసుకొచ్చిన తరువాత వాటిని అందులో నుంచి తీసి వాటిని బయట వేయాలి. లేదంటే వాటితో మన వంటిల్లు అపరిశుభ్రంగా మారుతుంది. వంట చేసుకునే సందర్భంలో కూరగాయలు, మాంసంను కడిగాలి. కడిగి వండుకుంటేనే పరిశుభ్రంగా ఉంటుంది. మనం కడిగేటప్పుడు సింక్ లో మాంసం ముక్కలు పడకుండా జాగ్రత్తలు వహించాలి.

వంట గదిలో నూనె పడితే వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే దాని మీద మనం కాలు వేస్తే జారి కింద పడిపోతాం. ఇల్లంతా అపరిశుభ్రంగా మారుతుంది. మన ఫ్రిజ్ ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన పదార్థాలు కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రిజ్ లో పెడితే ఇబ్బందులు ఉండవు. ఫ్రిజ్ ను అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. లేకపోతే అందులో నుంచి దుర్వాసన వచ్చి మన వంటిల్లు దారుణంగా మారుతుంది. ఇలా జాగ్రత్తలు తీసుకుని వంటిల్లును పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలను దరిచేరనీయకుండా చూసుకుంటే మంచిది.