Sleeping: ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి నిద్ర అవసరమే. అలాగే మనిషికి కూడా తిండి, నిద్ర లేకపోతే జీవితమే లేదు. వీటిలో ఏది లోపించినా ప్రమాదమే. అందుకే నిద్ర అంత ముఖ్యమైనదని గుర్తించాలి. లేకపోతే మన మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. జీవకోటికి నిద్ర కచ్చితంగా ఉండాలి. అవి బతకాలంటే నిద్ర పోవాలి. దానికి అనుగుణంగా తిండి కూడా ఉండాలి. ఈ నేపథ్యంలో ఏ వయసు వారు ఎంత సేపు నిద్ర పోవాలనేదానిపై ఓ సారి ఆలోచిద్దాం. అన్ని వయసుల వారు ఒకే తీరుగా నిద్రపోరు. శిశువులకు ఎక్కువ నిద్ర, ముసలి వారికి తక్కువ నిద్ర అవసరం అవుతుంది. అందుకే వారి వయసుల పరంగా ఎంత సమయం నిద్ర పోతే మంచిదనే దాని మీద ఓ లుక్కేద్దాం.

పుట్టిన బిడ్డకు నిద్ర చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు నిద్రలోనే పెరుగుతారని చెబుతారు. ఈ కోణంలో నవజాత శిశువు (0-3 నెలలు) 14-17 గంటలు నిద్ర పోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్య వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఎదిగేందుకు అవసరమైన హార్మోన్లు కూడా విడుదల అవుతాయి. శిశువు (4-12 నెలలు) 12-15 గంటలు నిద్ర పోవాలి. కొంచెం ఆడుకున వయసు కావడంతో ఓ రెండు మూడు గంటలు ఆడుకుని తరువాత నిద్ర పోవడం వారికి అలవాటే. ఇక చిన్నారులు (ఏడాది-రెండేళ్లు) 11-14 గంటలు నిద్రపోవాలి.
చిన్నారులు (3-5 ఏళ్లు) 10-13 గంటలు నిద్ర పోతారు. వీరు అంగన్ వాడీ కి వెళ్లడంతో అవసరమైతే అక్కడ కూడా నిద్ర పోవడం చూస్తుంటాం. బాలలు (6-13) 9-11 గంటలు నిద్ర పోవాల్సిందే. వీరు ఆటపాటల్లో మునిగి తేలుతారు. అందుకే త్వరగా అలసిపోయి నిద్ర పోతుంటారు. టీనేజర్లు (14-17 ఏళ్లు) వీరు 8-10 గంటలు నిద్ర పోవాలి. వీరు తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటారు. పెద్దలు (18-64 ఏళ్లు) 7-9 గంటలు నిద్ర పోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో మన జీవన విధానమే దెబ్బ తింటుంది.

వృద్ధులు (65+) రోజుకు 7-9 గంటలు నిద్ర పోవాలి. నిద్రకున్న ప్రాముఖ్యతన గుర్తించి ప్రతి వారు నిద్ర సరిగా పోవడానికి తగిన పరిస్థితులు కల్పించుకోవాలి. తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. నిద్ర లేకపోతే మన అవయవ వ్యవస్థ దెబ్బ తింటుంది. గుండె బలహీనంగా మారుతుంది. రోగ నిరోధక వ్యవస్థ చెడిపోతుంది. ఫలితంగా వ్యాధులు చుట్టు ముడతాయి. జీవితం నరకంగా మారుతుంది. అందుకే తిండికి ఎంత సమయం కేటాయిస్తామో అలాగే నిద్రకు కూడా అలాే సమయం కేటాయించుకుని మంచి నిద్ర పోయి జీవితాన్ని హాయిగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.