Balakrishna- Advertisement: నటసింహం బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త అవతారం ఎత్తారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ వారి 116 పారామౌంట్ రియల్ ఎస్టేట్ వెంచర్ ని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. దీని కోసం బాలకృష్ణ యాడ్ చేయడం జరిగింది. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ వారి ఇంటిని కొంటే కలకాలం క్షేమం అంటూ ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో మొదటిసారి ఒక బ్రాండ్ కి ప్రచారం కల్పించారు. ఎలాంటి వ్యాపార సంస్థల ఉత్పత్తుల ప్రకటనల్లో నటించకూడదు, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించకూదని నియమం పెట్టుకున్న బాలయ్య, దాన్ని బ్రేక్ చేసి సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కోసం పని చేస్తున్నారు.

బాలయ్యకు ఉన్న స్టార్ డమ్ రీత్యా గతంలో అనేక కార్పొరేట్ సంస్థలు ప్రచారకర్తగా ఉండాలంటూ సంప్రదించాయి. అయినా బాలయ్య ససేమిరా అన్నారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కోసం ఫస్ట్ టైం ఆ పని చేశారు. మరి తాను పెట్టుకున్న సిద్ధాంతాని బ్రేక్ చేసిన బాలయ్య సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుండి భారీగానే బాదినట్లు సమాచారం అందుతుంది.ఈ యాడ్ కోసం బాలయ్య ఏకంగా రూ. 15 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల అంచనా.
అది ఆయన సినిమా రెమ్యూనరేషన్ కంటే ఎక్కువని చెప్పాలి. బాలయ్య మార్కెట్ రీత్యా ఆయన రూ. 10 నుండి 15 కోట్ల లోపే తీసుకుంటున్నారు. అఖండ తర్వాత పెంచారని సమాచారం. ఆ లెక్కన చూస్తే బాలకృష్ణ ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా అందుకున్నారు. బాలయ్య చెప్పినట్లు… ఏదైనా ఆయన దిగనంత వరకే, దిగితే నయా రికార్డ్స్ సెట్ చేస్తారు.

బాలకృష్ణ హోస్ట్ గా కూడా సక్సెస్ కొట్టి చూపించారు. అన్ స్టాపబుల్ వరల్డ్ వైడ్ రికార్డ్స్ నమోదు చేసింది. సీజన్ వన్ సంచలనాలు నమోదు చేయగా ఇటీవల సీజన్ 2 స్టార్ట్ చేశారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాకు అన్ స్టాపబుల్ షో ప్లస్ అయ్యింది. హోస్ట్ గా బాలయ్య అనగానే నవ్వుకున్న వాళ్ళ నోళ్లు చేతలతో మూయించాడు. ఇక అఖండ సక్సెస్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డిగా సంక్రాంతికి వీరవిహారం చేయనున్నారు. ఈ మూవీ సక్సెస్ పై అందరూ విశ్వాసంతో ఉన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు.