Electric Vehicles: దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడిపై ప్రభావం పడుతూనే ఉంది. పెరుగుతున్న ధరలతో ఏం చేయలేని పరిస్థితి. దీంతో పెట్రో భారాన్ని తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరు ప్రణాళికలు రచిస్తుంటారు. కానీ కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్ర్టిక్ వాహనాల వినియోగం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈవీలతో పెట్రో సమస్యలు ఉండవు. చార్జింగ్ పెట్టుకుంటే చాలు. ఎంత దూరమైనా ఎలాంటి డబ్బులు ఖర్చు కాకుండా వెళ్లొచ్చు. దీంతో పెట్రోల్ తో నడిచే వాహనాలతో ఖర్చు అధికమవుతోంది. జేబులు ఖాళీ అవుతున్నాయి. అందుకే ఎలక్ర్టిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. డబ్బును ఆదా చేసుకోవాలని భావిస్తున్నారు.

ఎలక్ర్టిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు సైతం రాయితీలు ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. భవిష్యత్ లో ఎలక్ర్టిక్ కార్లు కూడా రాబోతున్నాయి. పెట్రోల్ సమస్యతో ఎలక్ర్టిక్ వాహనాల గిరాకీ పెరుగుతోంది. వాహనాల కొనుగోలుపై కేవలం ఐదు శాతం జీఎస్టీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఈవీల కొనుగోలుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఎటు వెళ్లాలన్నా డబ్బుల సమస్య మాత్రం ఉండదు.
మీరు ఈవీల కొనుగోలుకు ముందుకు వస్తే 80ఈఈబీ (ఇంట్రస్ట్ లోన్ ఫర్ ఎలక్ర్టిక్ వెహికిల్స్) కింద వాహనం పన్ను మినహాయింపులను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుండి లోన్ తీసుకున్నా కొన్ని మినహాయింపులు మీకు వర్తిస్తాయి. దీంతో ఏడాదికి రూ.1.5 లక్షల వరకు వడ్డీ మినహాయింపు లభించవచ్చు. త్రీవీలర్ ఎలక్ర్టిక్ వాహనాలకు కూడా ఇవి వర్తిస్తాయి. రిజిస్టర్ బ్యాంకు ఎన్బీఎస్సీ ద్వారా రుణాలు తీసుకుంటే మినహాయింపుల లాభం కలుగుతుంది.

ఎలక్ర్టిక్ వాహనాలతో పెట్రోల్ పోసుకునే ఇబ్బంది ఉండదు. ఖర్చు లేకపోవడంతో ఎటు వెళ్లాలన్నా ఎలాంటి సమస్యలు ఉండవు. పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ఈవీల జోరు పెరిగింది. గతంతో పోలిస్తే ఈ రోజుల్లో ఈవీలను కొనుగోలు చేసి ఇబ్బందులు తొలగించుకోవాలని చూస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. పెట్రో వాహనాలకు బదులు ఈవీలు కొనుగోలు చేసుకుని పెట్రో మంటలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు.