Coconut Milk: ఎండాకాలం మొదలు కాబోతుంది. ఈ సమయంలో చల్లటి పానీయాలు తాగాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అయితే కిరాణం షాపుల్లో, బేకరీల్లో లభించే కూల్ డ్రింగ్ తాగాలని చాలా మంది అనుకుంటారు. కానీ వీటి వల్ల నోటికి రుచి అందుతుంది.. మనసును హాయిగా ఉంటుంది.. కానీ శరీరానికి ఇవి కీడు చేస్తాయని ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా చాలా మంది ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి సమస్యంలో ఎక్కవుగా కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా నాచురల్ గా లభించే పానీయాలను తీసుకోవడం మంచిది. ఎలాంటి రసాయనాలు కలిపేందుకు అవకాశం లేకుండా వచ్చే పానీయం కొబ్బరి నీళ్లు మాత్రమే. ఇవి వేసవి కాలంలో మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి కాస్త టేస్ట్ తక్కువగా ఉన్నా.. ఇవి ఇచ్చే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు. ఇంతకీ కొబ్బరి బొండాను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పుడు చూద్దాం..
కొబ్బరి చెట్లు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలను ప్రత్యేకంగా చూడొచ్చు. అయితే కొందరు ఇతర ప్రదేశాల్లో కూడా ప్రత్యేకంగా కొబ్బరి తోటలను పెంచుతున్నారు. ప్రతీ ఏడాదికి ఒక కొబ్బరి చెట్టు 50 నుంచి 100 వరకు కొబ్బరి బొండాలను అందించనుంది. ఇలా 100 ఏళ్ల వరకు ఇది కాయలను అందిస్తూ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. దీంతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతాయి. రక్త పోటును తగ్గిస్తాయి. ఇది చెడు కోలెస్ట్రాల్ ను పెరగకుండా చేసి హార్ట్ బీట్ రేటును సక్రమంగా ఉంచుతుంది.
కొబ్బరి బొండాం నీళ్లలో లారిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి కాపాడుతుంది. అలాగే ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దీంతో శరీరానికి ఇమ్యూనిటీ ఫవర్ ను అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో అనేక రకాలైన ఖనిజాలు లభ్యమవుతాయి. ఇందులో మెగ్నీషియం, పోటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. దీంతో దీనిని తీసుకోవడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి. అలాగే మజిల్స్ గ్రోత్ ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో గుండె మెరుగ్గా పనిచేస్తుంది.
కొబ్బరి బొండంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో దీని నీళ్లు తీసుకున్నా.. ఇందులో లభించే లేత కొబ్బరి తిన్నా పేగుల్లో ఉండే యాసిడ్ ను తగ్గిస్తుంది. దీంతో జీర్ణ సమస్య నుంచి బయటపడుతారు. ఇక బరువు తగ్గాలని అనుకునేవారు కొబ్బరి బొండాం నీళ్లు మంచి ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తాయి. దీనిని రెగ్యులర్ గా తాగడం వల్ల త్వరగా బరువు దిగుతారు. బ్రెయిన్ సమస్యలు రాకుండా ఉంచడంతో పాటు అల్జీమర్స్ సమస్యలకు చెక్ పెట్టే కొబ్బరి బొండ నీటిని తరుచుగా తాగడం మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి బొండంను రోజుకు ఒకటైనా తాగడానికి ప్రయత్నించాలి. దీంతో ఎండ తీవ్రత నుంచి బయటపడుతారు.