Sankranti Festival: హైదరాబాద్ ప్రజలకు పండుగలు వచ్చాయంటే చాలు ఇంట్లో తప్పకుండా మాంసం ఉండాల్సిందే. సాధారణ రోజుల్లోనే ముక్క లేనిదే నగరవాసులకు ముద్ద దిగదు. అటువంటిది పండుగ రోజుల్లో నాన్‌వెజ్ లేకుండా ఉంటారా..? సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ మూడు రోజులు చికెన్, మటన్ విక్రయాలు జోరందుకున్నాయి. మటన్ కంటే నగరంలో ఈసారి చికెన్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయని తెలిసింది. నాన్ వెజ్ ప్రియులు మటన్ కంటే చికెన్‌కే ఓటు వేశారట.. కారణం మటన్‌తో పోలిస్తే చికెన్ ధరలు మార్కెట్లో తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

తాగా గణాంకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో చికెన్ తిన్నారని తెలిసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కిలోల చికెన్ కొనుగోలు చేశారని సమాచారం. ప్రధానంగా మటన్ కంటే చికెన్ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్ ధర మటన్ కంటే తక్కువగా ఉండటమే అని వినియోగదారులు చెబుతున్నారు.
Also Read: రోజుకు 2 నిమిషాలు అద్దం ముందు ఇలా చేయండి.. విజయాన్ని పొందండి!
మేక, పొట్టేలు మాంసం కిలో రూ.850- రూ.900 ఉండగా.. చికెన్ మాత్రం కేజీకి రూ.240 పలికింది. గ్రేటర్ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్ వినియోగం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వీకెండ్‌లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయిందని అంచనా. మామూలు రోజుల్లో మటన్ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి.
ఆదివారం మాత్రం ఏకంగా ఐదు లక్షల కిలోల మటన్‌ను గ్రేటర్ ప్రజలు లాగించేశారు. మూడు రోజుల్లో మటన్ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నట్టు తెలిసింది. నగరంలో జనాభా నానాటికీ పెరుగుతుండటం, డిమాండ్‌కు తగ్గట్టు మార్కెట్లో మటన్ లభ్యం కాకపోవడం వల్లే ధరలు ఎక్కువగా ఉన్నట్టు మాంసం వ్యాపారులు చెబుతున్నారు.
Also Read: టెస్లా వివాదం: కేటీఆర్ కు పోటీగా తీన్మార్ మల్లన్న ఎంట్రీతో హీట్లు