Red Cabbage Benefits: మన ఆరోగ్యానికి కూరగాయలు ఎంతో ఉపయోగపడతాయి. కూరగాయల్లో మనకు పనికొచ్చే వాటిలో చాలా వరకు ఉన్నాయి. అందులో మన కంటి చూపును కాపాడే వాటిలో క్యాబేజీ ఒకటి. దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాబేజీలో మనకు పనికొచ్చే ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
పర్చుల్ కలర్ క్యాబేజీలో అంథోసయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాబేజీ ఆ రంగులో ఉంటుంది. అంథోసయనిన్స్ శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. దీంతో ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కణజాలం రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ దూరం చేస్తుంది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది పర్చుల్ కలర్ క్యాబేజీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులు తగ్గిస్తాయి.
ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెంచుతుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. బ్లీడింగ్ ఆగేలా చేస్తుంది. ఈ క్యాబేజీలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గించేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా చేసే గుణం ఇందులో ఉంది. క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో పూడికలురాకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.