Lady Linger Benefits: మనకు కూరగాయల్లో లభించే పోషకాలు తెలిసినవే. మాంసాహారం కంటే శాఖాహారంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శాఖాహారమే మన దేహానికి మంచిది. మాంసాహారం కంటే ఎన్నో రెట్టు శక్తి శాఖాహారంలో లభిస్తుంది. కూరగాయల్లో బెండకాయకు ఉన్న విలువ ఎంతో ఉంటుంది. దీన్ని కూరగా చేసుకుంటే ఇక లొట్టలేసుడే. బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు, బెండకాయ 65 కూర ఏదైనా దాని రుచే వేరు. అందుకే బెండకాయను కూరల్లో చేర్చుకుంటే దాని మజానే వేరు. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ముడిపడి ఉన్న బెండకాయ ఆహారంగా తీసుకోవడం మనకు అలవాటే. దీంతో నోటికి రుచితో పాటు దేహానికి ఎంతో మేలు కలుగుతుందనడంతో సందేహం లేదు.

బెండకాయ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. చక్కెర స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లు వారంలో కనీసం ఒకసారైనా బెండకాయ తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తొక్కలో ఉండే ఎంజైమ్ లు ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. దీంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బెండకాయలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లేకుండా చేయడంలో సహాయపడుతుంది. ఊబకాయంతో బాధపడే వారు కూడా దీన్ని ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.
అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది. చెడు కొవ్వును తగ్గించే గుణం దీనిలో ఉంటుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నిరోధక కణాల వల్ల పెద్దపేగు, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. దంతక్షయంతో బాధపడే వారికి కూడా బెండకాయ ఔషధంగా పనిచేస్తుంది. గర్భవతులు తింటే బిడ్డకు ప్రయోజనం. ఫోలేట్ సమృద్ధిగా అందడంతో బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఫోలిక్ యాసిడ్ నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది.

బెండకాలో ప్రొబయాటిక్స్ కూడా ఉండటంతో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. ప్లేవనాయిడ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపడంతోపాటు ఎన్నో మంచి పనులు చేస్తుంది. అందుకే బెండకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు అధిక లాభాలు కలుగుతున్నాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారు చేస్తుంది. బెండకాయను రోజువారీ ఆహారంలో తీసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.