Hug Benefits: శృంగారమంటే అందరికి ఇష్టమే. అందులో ఉన్న మజాయే వేరు. దీనికి ఆకర్షితులు కాని వారు ఎవరుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా మనిషిలోని మస్తిష్కాన్ని ఉత్సాహంతో తట్టిలేపేదే. అందుకే శృంగారంలో రసానుభూతి పొందడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో శృంగారాన్ని మధురానుభూతి పొందేక్రమంలో ఎంతో ఉత్సాహం కలిగి ఉంటారు. దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. శృంగారంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. వైద్యులు కూడా వారానికి కనీసం రెండు సార్లయినా శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు.

శృంగారం తరువాత కౌగిలించుకోవడం వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. శృంగారం అయిపోయిన తరువాత కౌగిలించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. కలయిక తరువాత ఆనందం రెట్టింపవుతుంది. కొంతమంది కలయిక తరువాత ఎవరి దారిలో వారు వెళ్లడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల హత్తుకోవడం, కౌగిలించుకోవడం వల్ల ఎన్నో రకాల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శృంగారం తరువాత కౌగిలించుకోవడం ద్వారా బంధం బలోపేతమవుతుందని చెబుతున్నారు.
భాగస్వామితో క్రమం తప్పకుండా శృంగారం చేస్తున్నట్లయితే భార్యను ఇష్టంగా కౌగిలించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శృంగారం అనంతరం కౌగిలించుకోవడం వల్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీవిత భాగస్వామిని పట్టుకుని పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోనిన్ లేదా లవ్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. క్లైమాస్స్ లో ఇలా చేస్తే మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆలితో సంబంధం మరింత పెరుగుతుంది. ఆక్సిటోనిన్, ప్రేమ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అని పిలుస్తారు.

భాగస్వామితో మంచి సంబంధం పెనవేసుకోవాలంటే ఇలా చేయడమే మార్గం. ఆక్సిటోనిన్ విడుదల మానసిక స్థితిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ జీవితాన్ని ఆహ్లాదకరంగా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. భార్యను కౌగిలించుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యలను తగ్గిస్తుంది. కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు తగ్గి గుండెలు పదిలంగా కొట్టుకుంటాయి. ఓ అధ్యయనం ప్రకారం భాగస్వామితో క్రమం తప్పకుండా సంభోగం జరిపితే రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉండటం సహజం.
కౌగిలించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఈ సందర్భంగా విడుదలయ్యే హార్మోన్ కార్టిసాల్ ను తగ్గిస్తుంది. ఆక్సిటోనిన్ ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ హార్మోన్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మంచిగా నిద్ర పోయేందుకు దోహదపడుతుంది. మనసును సంతోషంగా ఉంచుతుంది. శరీరంలో హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇలా శృంగారం తరువాత కౌగిలించుకోవడం వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.