https://oktelugu.com/

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో #RRR ని అందుకోలేకపోయిన పాన్ ఇండియన్ స్టార్స్..భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఆ ఛాన్స్ ఉందా?

మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే, అది రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం మాత్రమే. అప్పటి వరకు చెక్కుచెదరకుండా పదిలంగా ఉన్నటువంటి బాహుబలి 2 రికార్డు ని ఈ సినిమా అవలీలగా దాటేసింది. ఫుల్ రన్ లో దాదాపుగా 270 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 06:57 PM IST
    Follow us on

    Pawan Kalyan: మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే, అది రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం మాత్రమే. అప్పటి వరకు చెక్కుచెదరకుండా పదిలంగా ఉన్నటువంటి బాహుబలి 2 రికార్డు ని ఈ సినిమా అవలీలగా దాటేసింది. ఫుల్ రన్ లో దాదాపుగా 270 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ నటించిన ‘సలార్’ , ‘కల్కి’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రాలు 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి. ఇక ఆ తర్వాత విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా #RRR తెలుగు స్టేట్స్ రికార్డు కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.

    ఇక రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎలాంటి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పినదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 1750 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఫుల్ రన్ లో రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే మొట్టమొదటి ఇండియన్ సినిమాగా త్వరలోనే సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ఇలాంటి సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో #RRR రికార్డు కి ఆమడదూరం లో ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇప్పటి వరకు 210 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో పది కోట్ల రూపాయలకు మించి వసూళ్లు వచ్చేలా లేవని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంటే #RRR చిత్ర రికార్డుకి 50 కోట్ల రూపాయిల దూరం లోనే ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతాలను నెలకొల్పిన పుష్ప 2 వల్లే కాలేదంటే #RRR ఏ రేంజ్ రికార్డు అనేది అర్థం చేసుకోవచ్చు.

    ఇలా రికార్డుల వర్షం కురిపించిన సినిమాలు కూడా #RRR ని ముట్టుకోకపోవడం తో భవిష్యత్తులో ఈ రికార్డు ని కొట్టేది ఎవరు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో జోరు అందుకుంది. త్వరలోనే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి టాక్ వస్తే కచ్చితంగా 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుంది కానీ, ఫుల్ రన్ లో #RRR ని కొట్టాలంటే 50 రోజుల వరకు షేర్స్ రావాలి. ఆ రేంజ్ షేర్స్ కష్టమే అనుకోవచ్చు. ఈ రికార్డు ని కొట్టడం కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన నుండి వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ట్రేడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. మార్చి 28 వ తారీఖున ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. మంచి విడుదల తేదీ అవ్వడంతో ఈ చిత్రం #RRR మొదటి రోజు రికార్డు తో పాటు, తెలుగు రాష్ట్రాల ఫుల్ రన్ రికార్డుని కూడా బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.