Hair Fall Stop: మనిషికి జుట్టే అందం. అందుకే అంటారు వెంట్రుకలున్న కొప్పు ఎటేసిన అందమే అని. వెంట్రుకలతోనే మనిషికి కళ వస్తుంది. అవి లేకపోతే మన ఆకారం సరిగా ఉండదు. దీంతో జుట్టు రాలిపోకుండా, తెల్ల బడకుండా ఉండటానికి అనేక చర్యలు తీసుకుంటారు. జుట్టు సంరక్షణలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడం పరిపాటే. ఈ నేపథ్యంలో జుట్టు రాలకుండా ఉండటానికి ఆపసోపాలు పడుతుంటారు. జుట్టుకు ఏవో రకరకాల నూనెలు, షాంపూలు వాడుతున్నారు. దీంతో ఇంకా వెంట్రుకలు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతోంది. ఈ క్రమంలో జుట్టును రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నారు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

కొంచెం ఆవనూనె వేడిచేసి అందులో ఉసిరిముక్కలు, మెంతులు వేసి మరిగించాలి. చల్లారిన తరువాత వెంట్రుకల మొదళ్లకు పట్టించాలి. రాత్రి అలాగే ఉంచుకుని మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో జుట్టులో ఎంతో మార్పు వస్తుంది. జుట్లును సంరక్షించుకునే క్రమంలో ఇలాంటి చిట్కాలు పాటించి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. అంతేకాని ఏవో ఇంగ్లిష్ మందులు వాడుతూ ఇబ్బందులను కొనితెచ్చుకోవద్దు. జుట్టును జాగ్రత్తగా చూసుకుంటేనే ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత జుట్టుకు పట్టించి తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు వెరవకుండా ఉంటుంది. జుట్టును నెరవకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ ఏవో మందులు వాడి జుట్టును పాడుచేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఇంకా కొన్నిచిట్కాలు ఉండటంతో వాటిని వాడుకుని జుట్టు సమస్యలు లేకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి.

వెంట్రుకలకు కలర్ రీ బాండింగ్ ఉత్పత్తుల వాడకంతో ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా వాటిని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. దీంతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏది పడి పడితే అవి వాడి ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకునే విధంగా అన్నింటిని వాడేందుకు మొగ్గు చూపకూడదు. శాస్త్రీయ ఆధారాలతోనే మనం వాడుకునే వాటిని జాగ్రత్తగా పరిశీలించి జుట్టుకు సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరు గమనించి అజాగ్రత్తగా వ్యవహరించొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.