Geetu Royal: ప్రతి వారం లో లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్కు చాలా హీట్ వాతావరణం మధ్యలో జరిగింది..ఇన్ని రోజులు ప్రేక్షకులు బిగ్ బాస్ లో ఎలాంటి టాస్కులు కోసం ఎదురు చూసారో, అలాంటి టాస్కుని బిగ్ బాస్ ఇవ్వడం తో ఎంతో ఆసక్తికరంగా గేమ్ సాగిపోయింది..బిగ్ బాస్ టీం హౌస్ బయట నుండి విసిరినా చేపలను ఇంటి సభ్యులు రెండు జట్టులుగా విడిపోయి..ఎవరికీ ఇచ్చిన బుట్టలో వారు వేసుకోవాలి..ఆ తర్వాత ఆ చేపలను మిగిలిన ఇంటి సభ్యులు దొంగలించకుండా కాపాడుకోవాలి..అంతే కాకుండా పూల్ లో వేసిన గోల్డ్ కాయిన్ ని వెతికి పట్టుకున్న ఇంటి సబ్యులకు ప్రత్యేకమైన పవర్స్ వస్తాయి.

ఈ టాస్కులో ఇంటి సభ్యులందరు చెలరేగిపోయి ఆడారు..అయితే ఈ టాస్కు నుండి అందరికంటే తక్కువ చేపలను పట్టుకున్న గీతూ మరియు ఆదిరెడ్డి జంటలను బిగ్ బాస్ ఆట నుండి తొలగించాడు..ప్రస్తుతానికి అందరికంటే ఎక్కువ చేపలను కలిగున్న జంట రేవంత్ – ఇనాయ సుల్తానా.
ఈ టాస్కులో గీతూ గేమ్ చెంజర్ గా మారింది..ప్రతి ఒక్క ఇంటి సభ్యులను రెచ్చగొడుతూ చేపలను దొంగిలించే ప్రయత్నం చేసింది..ముఖ్యంగా రోహిత్ మరియు మెరీనా లతో గీతూ గొడవ పెట్టుకోవడం ఈ ఎపిసోడ్ లో పెద్ద చర్చలకు దారి తీసింది..రోహిత్ వైపు చూస్తూ ‘నీకు అసలు ఆట ఆడడమే రాదు..నీకు బిగ్ బాస్ ఇచ్చిన జంట ఎవరు..? నువ్వు ఎవరికీ సపోర్టు చేస్తున్నావు..కలిసి ఆడండి అన్నప్పుడేమో కలిసి ఆడారు..విడిపోయి ఆడండి అన్నప్పుడేమో కలిసి ఆడుతారు..అసలు మీకు గేమ్ ని అర్థం చేసుకోవడమే రాదు’ అంటూ రోహిత్ మరియు మెరీనా లపై చెలరేగిపోయింది గీతూ..అలా వాళ్ళిద్దరితో చాలాసేపు గొడవలు అయినా తర్వాత మళ్ళీ రేవంత్ తో , కీర్తి గొడవలకు దిగింది..ఇలా ప్రశాంతం గా సాగే టాస్కు ని గీతూ రెచ్చగొట్టడం వల్ల గొడవలకు దారి తీసింది.

అంత అయిపోయిన తర్వాత..టాస్కులో వైదొలిగిపోతాను అని అర్థం అయ్యేసరికి గీతూ వెక్కిళ్లు పెట్టి ఏడవడం ప్రారంభించింది..హౌస్ లో ఇప్పటి వరుకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఎదో ఒక సందర్భం లో ఏడ్చారు కానీ..గీతూ మాత్రం ఏడవలేదు..అలాంటిది ఈ టాస్కులో ఆమె ఏడవడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.