Seven Horses Painting: ప్రతి ఒక్కరు విజయం సాధించాలి అని కోరుకుంటారు కానీ అందరికి సాధ్యం కాదు. దానికి కారణం కష్టం మాత్రమే కాదు. అదృష్టం కూడా ఉండాలి అని వింటుంటాం. ఎంత ప్రయత్నించినా, కష్టపడ్డా కూడా కొన్ని సార్లు ఫలితాలు శూన్యమే. అయితే జీవితంలో విజయం సాధించాలంటే కర్మను విశ్వసించాల్సిందే. అంతేకాదు శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. సానుకూల, ప్రతికూల శక్తి రెండు రకాలుగా ఉంటుందని వాస్తు వివరిస్తుంది. ఇదిలా ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ఏడుగుర్రాల పెయింటింగ్ ప్రాధాన్యత వహిస్తుంది.
ఈ పటాన్ని ఎందుకు ఉంచాలి?
మన సంస్కృతిలో 7వ అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, వివాహ బంధంలో ఏడు ప్రమాణాలు, ఏడు అడుగులు, ఏడుగురు రుషులు ఇలా 7వ అంకెను సూచిస్తుంది. ఈ క్రమంలోనే ఏడు గుర్రాల పెయింటింగ్ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. గుర్రం విజయం, శక్తిని సూచిస్తుంది. అంతేకాదు సూర్య భగవానుడికి ఏడు గుర్రాల రథం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పెయింటింగ్ ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది.
ఫలితాలు..
పరుగెత్తే గుర్రాలు వేగానికి సూచన. అంటే విజయం సాధించాలంటే మనం కూడా పరుగెత్తాల్సిందే. అందుకే ఇలాంటి పటాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న వారు ఎలాంటి పనిని అయినా త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటారట.
ఏడు గుర్రాల పటాన్ని ఎక్కడ ఉంచాలి?
ఈ పెయింటింగ్ ను తూర్పు గోడకు వేలాడదీయాలి. ఉత్తరం వైపు కూడా దీన్ని ఉంచవచ్చు. ఇక సేవా రంగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్ కు కారణమవుతుందని టాక్. ఆ ఇంట్లో శ్రేయస్సు, సంపదను అందిస్తుంది. అంతేకాదు పేరు, కీర్తిని తెస్తాయి కాబట్టి దక్షిణ భాగంలో కూడా ఉంచవచ్చు. ఒకవేళ దక్షిణ గోడపై పెయింటింగ్ ఉంచేందుకు వీలు లేకపోతే ఇంటి కిటికీ ముందు కూడా ఉంచవచ్చు. అయితే ఈ కిటికీ కచ్చితంగా ఈ పెయింటింగ్ కు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.