Sleeping: భోజనం చేయగానే నిద్ర వస్తుందా? అయితే ఈ పని చేయండి

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే రెప్పలు పడిపోతుంటాయి. నిద్రపోవాలన్న ఆకాంక్ష వైపు అడుగులు వేస్తుంటాయి. మనం తీసుకునే ఆహారం, జీర్ణ ప్రక్రియలో వివిధ అంశాలు నిద్రను తెచ్చి పెడతాయి.

Written By: Dharma, Updated On : November 25, 2023 6:16 pm

Sleeping

Follow us on

Sleeping: సాధారణంగా పగటిపూట నిద్ర అనేది చాలామందికి సమస్యగానే ఉంటుంది. పగలు ఒక్కసారైనా చిన్నపాటి మబ్బు, మగతగా ఫీలవుతుంటారు. పాఠశాలల్లో విద్యార్థులు, కార్యాలయాల్లో ఉద్యోగులు, శ్రామికులు.. పగటిపూట అవకాశం ఉంటే కునుకు తీయాలని భావిస్తారు. కొందరైతే గాఢ నిద్రలోకి జారుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ నిద్ర ఎక్కువగా వస్తుంది. దీనికి కొన్ని ఆహార పదార్థాలే కారణమని పరిశోధనలో తేలుతోంది.

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే రెప్పలు పడిపోతుంటాయి. నిద్రపోవాలన్న ఆకాంక్ష వైపు అడుగులు వేస్తుంటాయి. మనం తీసుకునే ఆహారం, జీర్ణ ప్రక్రియలో వివిధ అంశాలు నిద్రను తెచ్చి పెడతాయి. అందుకే మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే.. ఇటువంటి పనికి ఉపక్రమించకూడదు. కాసేపు అటు ఇటు నడవాలి. లేదా మెట్ల మార్గం ద్వారా నడవాలి. ఇటువంటి ఎక్సర్సైజ్ తో రక్తంలోని ఆక్సిజన్ కంటెంట్ ను పెంచడానికి.. మరింత శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. అతిగా తినడం వల్ల త్వరగా మగత సమస్య వస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. నిద్ర రావడంతో పాటు నీరసంగా ఉంటుంది. అలా అనిపించకుండా ఉండాలంటే అతిగా తినడం నియంత్రించుకోవాలి. తక్కువ తక్కువగా.. మధ్య మధ్యలో ఆహారం తినాలి.

అలసట, విచారం, ఏకాగ్రత లోపం.. ఇవన్నీ డిహైడ్రేషన్ లక్షణాలు. రోజులో సరిపడా నీరు తాగడానికి ప్రయత్నించాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత మగత సమస్యను నివారించడానికి శరీరం హైడ్రేట్ గా ఉండడం అవసరం. అందుకే మంచినీరు ఎక్కువగా తాగాలి. శరీరానికి అసౌకర్యం కలిగే ఆహారాన్ని పక్కన పెట్టాలి.ఇవన్నీ చేస్తే పగటిపూట నిద్రను కొంతవరకు నియంత్రణ చేసుకోవచ్చు. అది ఆరోగ్యానికి మంచిది కూడా.