Goddess Lakshmi: జీవితాన్ని జయించడం అంటే మాములు విషయం కాదు. ఎన్నో కష్టాలు.. ఎదురుదెబ్బలు తట్టుకొని ముందుకు వెళ్లాలి. అప్పుడే అందమైన జీవితం ముందుంటుంది. అయితే చాలా మంది ఎంత కష్టపడినా.. ఎంత పెద్ద ప్లాన్ ప్రకారం డబ్బలు సంపాదించినా.. చేసిన అప్పులు తీరవు. చిన్న చిన్న అప్పులు పెద్దవిగా మారి.. అవి జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి వారికి కాస్త అదృష్టం తోడైతే అప్పులన్నీ తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు రోజులో భాగంగా కాస్త దైవంపై దృష్టి పెడితే ఆర్థిక బలం చేకూరుతుందని అంటున్నారు. ముఖ్యంగా ధనదేవత లక్ష్మిదేవని ఆరాధించడంతో పాటు కొన్ని పనులు చేయడం వల్ల చేసిన అప్పుులు తీరడమే కాకుండా కొత్త అప్పులు చేయరని అంటున్నారు. అయితే అప్పులు తీరాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం..
ఇంట్లో ఆర్థిక బలం చేకూరాలంటే ధన లక్ష్మిని నిత్యం కొలుస్తూ ఉండాలి. లక్ష్మీదేవికి నెయ్యితో చేసిన దీపం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ లక్ష్మీదేవతకు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగిస్తే శుభప్రదం కలుగుతుంది.ఇలా చేయడం వల్ల అప్పులు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరికాయకు పీచు తీసిన తరువాత దానిమీద కుంకుమ చల్లి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కుకోవాలి. ఆ తరువాత ఈ కొబ్బరికాయను నీటిలో వదలాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది.
ఈరోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్లు చూస్తున్నారు. ఏం మెసేజులు వచ్చాయి? ఎవరు లైక్ కొట్టారు? అని కానీ ఉదయం లేవగానే మీ అరచేతులను రెండింటినీ చూసుకోండి. ఇలా చేయడం వల్ల విష్ణుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు అరచేతులను చూడడం వల్ల ఆరోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. ఇక బుధవారం రోజు రెండు కొత్త ఖాళీ కుండలను తీసుకోవాలి. ఇవి చిన్నవైతే మరీ మంచిది. ఈ రెండు కుండల్లో కర్పూరం ముద్దలను వేసి వెలిగించాలి. ఇలా ఆరువారాల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
అలాగే ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా ఉంచాలి. లక్ష్మీదేవికి బుధవారం నైవేద్యం పెట్టడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. దీంతో అప్పుల సమస్య తీరుతుంది. సాయంత్రం సాంబ్రాణి వేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవె నెయ్యితో లక్ష్మీ దేవి దగ్గర నెయ్యితో దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని చదవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.