Snakes Bite: పాము కాటు కొన్ని సార్లు చాలా ప్రమాదకరమైనది. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. చాలా మంది యూట్యూబ్ ద్వారా నేర్చుకుని లేదా ఎక్కడో చదివిన జ్ఞానం తో ప్రథమ చికిత్స చేయాలని చూస్తారు. కానీ ఇవి కూడా ప్రమాదంగా మారుతాయి. అయితే ఇప్పుడు నిపుణులు చెప్పే ఈ వివరాలు గుర్తు పెట్టుకోండి.
ముందుగా పాము కుట్టిన వెంటనే దురద వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో అసలు గోకకూడదు. దురద ఉన్నా సరే ఒపిక పట్టాల్సిందే. ఇక ఈ ప్రాంతంలో రక్తస్రావం కూడా అవుతుంది. అయినా సరే గోకకుండా ఉండాలి. ఇక రక్తప్రవాహాన్ని నియంత్రించడానికి బ్యాండేజీని ఉపయోగించాలి. దీని వల్ల విషం ఒకే చోట గడ్డకడుతుంది. దీని వల్ల గ్యాంగ్రీన్ అవుతుంది. బట్టలు, తాడులను కట్టడానికి ప్రయత్నించవద్దు.
పాము కరిచిన ప్రాంతంలో మీ నోటి నుంచి విషాన్ని తొలగించడానికి ట్రై చేయకండి. దంతాల మధ్య లేదా చిగుళ్ల మధ్య ఉన్న గ్యాప్ ద్వారా విషం మీ మెదడుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు కూడా ప్రమాదకమే అవుతుంది గుర్తు పెట్టుకోండి.
ఇక పాటు కాటు వేసిన వెంటనే ఏం చేయాలి. పాము కరిస్తే భయపడకుండా ధైర్యంగా ఉండాలి. దీని వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు గురి కాదు. కరిచిన ప్రదేశంలో నీటితో కడగాలి. చేతితోనే వీలైనంత విషాన్ని తొలగించాలి. ఇక పాము కనిపిస్తే వెంటనే దూరం నుంచి ఫోటో తీయడం మర్చిపోకండి. పాము కరిచిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి సీటీబీటీ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల కాటు విషమా? కాదా అనే విషయం తెలుస్తుంది. కేవలం విషం లేని పామైతే కేవలం టీటీ ఇస్తారు. విషపూరితం అయితే చికిత్స చేస్తారు.