Health Tips: నిద్రించినప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే వైద్యుడిని కలవండి.. లేదంటే?

కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో సాంప్రదాయ ఆహారానికి బదులు వెస్ట్రర్న్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరోవైపు వాతావరణంలో కాలుష్యం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : November 4, 2023 10:35 am

Health Tips

Follow us on

Health Tips: నేటి కాలంలో చాలా మంది ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యంతో పాటు తినే ఆహారంలో క్వాలిటీ తగ్గడంతో అనేక రోగాలు దరిచేరుతున్నాయి. అయితే ఒక్కోసారి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ముందు శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. వీటిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ వెంటనే అప్రమత్తం కాకపోతే తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రిస్తున్న సమయంలో ఈ లక్షణాలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో సాంప్రదాయ ఆహారానికి బదులు వెస్ట్రర్న్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరోవైపు వాతావరణంలో కాలుష్యం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది ఏదో ఒక జబ్బుతో బాధ పడుతున్నారు. ఇటీవల కాలంలో మధుమేహం, బీపీ లాంటి వ్యాధులు తప్పనిసరిగా మారుతున్నాయి. అయితే ఇలాంటి వ్యాధులు వచ్చే ముందు కొన్ని సంకేతాలు పంపుతాయి. కొన్ని లక్షణాల ద్వారా ఇవి రాబోతున్నాయని తెలుపుతాయి.

శరీరంలో అన్నీ అవయవాలు ప్రధానమే. వీటిలో కాళ్ల పాదాలు కూడా ఇంపార్టెంటే అని చెప్పొచ్చు. పాదాల్లో ఉన్న నరాలు శరీరంలోని కీలక అవయవాలతో లింక్ అయి ఉంటాయి. కొన్ని వ్యాధులు నయం కావడానికి పాదాలను మర్దన చేస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ చేయడం వల్ల సమస్య కొంత వరకు నివారణ ఉండే అవకాశం ఉంది. అందుకు కారణం పాదాల్లో ఉండే నరాలు ప్రెస్ చేయడం వల్ల మిగతా అవయవాలపై ఈ ప్రభావం ఉంటుంది.

అయితే పాదాల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయంటే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా వర్ష, చలికాలంలో పాదాలు చల్లబడడం కామన్. కానీ వేసవి కాలంలో కూడా పాదాలు చల్లబడుతున్నాయంటే అది సమస్యే అని తెలుసుకోవాలి. ఇది మధుమేహానికి ముందు వచ్చే లక్షణం అని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రిస్తున్న సమయంలో కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయంటే పలు రోగాలకు సంకేతం అని భావించాలి. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.