Cough: చిన్న పిల్లలు తరచూ దగ్గుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

చలి విపరీతంగా పెరగడంతో పాటు పొగమంచు వంటి వాటి వలన చిన్నారులు దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. అయితే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గును తగ్గించడానికి మందులను ఉపయోగించకుండా ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు.

Written By: Velishala Suresh, Updated On : December 19, 2023 4:26 pm

Cough

Follow us on

Cough: సాధారణంగా ఏ కాలంలో అయినా చిన్న పిల్లలు తరచూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందులో శీతాకాలం వచ్చిందంటే మరీ ఎక్కువగా హెల్త్ పాడవుతుంది. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చిన్నారులతో పాటు పెద్దవారని సైతం జలుబు, ముక్కు కారడం, దగ్గు మరియు జ్వరం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వలన చిన్నారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

చలి విపరీతంగా పెరగడంతో పాటు పొగమంచు వంటి వాటి వలన చిన్నారులు దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. అయితే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గును తగ్గించడానికి మందులను ఉపయోగించకుండా ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అనేది తెలుసుకుందాం.

పసుపు.. సాధారణంగా పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పసుపును గోరు వెచ్చని పాలలో కలిపి తాగడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరగడమేకాకుండా దగ్గు, గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే సీజనల్ వ్యాధులు సైతం దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తులసి.. దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూర్చుతాయి. తులసి ఆకుల రసానికి కొంచెం తేనె కలిపి ఇస్తే చిన్నారుల్లో వచ్చే దగ్గు తగ్గుతుంది.

అలాగే వెల్లుల్లి.. దీనిలో కూడా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. చిన్న వెల్లుల్లి రెబ్బను మెత్తగా చేసి అందులో కాస్తా తేనే కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ చిట్కా రెండేళ్ల కంటే చిన్నవారికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తరువాత యూకలిప్టస్ ఆయిల్.. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఆయిల్ అందుబాటులో ఉంది. ఇంటిలో ఉన్న చిన్న పిల్లలు కనుక దగ్గు, జలుబుతో బాధపడుతుంటే రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ పడుకునే ముందు ఏదైనా క్లాత్ మీద వేసి వాసన పీల్చుతూ ఉండమని చెప్పాలి. ఇలా ఆయిల్ పీల్చడం వలన జలుబుతో పాటు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.