Kitchen Tips Telugu: మనం మన ఇంట్లో వంటలు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. హా ఏమౌతుంది అని అనుకంటాం కానీ.. వీటివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయండోయ్. మరీ ముఖ్యంగా ఫ్రిజ్‌లో కూరగాయలు, మాసం పెట్టే టప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మాత్రం వాటివల్ల మనకు అనారోగ్య సమస్యలు రాక మానవు.

కూరగాయలు, మాంసం ఒకే చోట అస్సలు పెట్టకూడదు. వీటిని ఒకే ట్రేలో పెట్టడం మంచిది కాదు. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు వండే కంటే ముందు వాటిని కాస్తంత గోరు వెచ్చని ఉప్పు కలిపిన నీటిలో శుభ్రంగా కడిగి వండటం మంచిది. అంతే కాకుండా పచ్చిమాంసాన్ని మాత్రం వీటి దగ్గర అస్సలు పెట్టకూడదు. దీన్ని వల్ల మనకు ఇబ్బందులు తప్పవు.
Also Read: చినజీయర్ స్వామి చివరి ఆశా నిరాశేనా?
ఎందుకంటే పచ్చి మాంసంలో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూరగాయల పక్కన పెడితే వాటి మీద ఉన్న బ్యాక్టీరియాలు కూరగాయల మీదకు చేరుతాయి. దాంతో మనం అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పచ్చి మాంసాన్ని ఫ్రిజ్ లో వేరే ట్రేలో పెట్టాలి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రిజ్‌లోని అన్ని ట్రేలను క్లీన్ చేసుకోవాలి.
ఇక కూరగాయలు, మాంసాన్ని కట్ చేసేందుకు ఒకే కత్తిని అస్సలు వాడకూడదు. కూరగాయలకు సెపరేటు చాకులను, మాంసానికి సెపరేటు చాకులను వాడాలి. అలాగే ఒకసారి వండిన మాంసాన్ని మరోసారి వేడి చేసేటప్పుడు.. ఎంత ఉష్ణోగ్రతలలో బ్యాక్టీరియాలు నశించిపోతాయో అంత వరకే ఉడికించాలి తప్ప.. అంతకు మించి వేడి చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు.
Also Read: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?
Recommended Video:
