Sunday- Surya bhagwan: ఆదివారం సెలవు అనే సంప్రదాయాన్ని బ్రిటిష్ వారు మనకు అలవాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతీయులను ఎలా లొంగదీసుకోవలనే దానిపై బ్రిటిష్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ తేల్చిందేమిటంటే బారతీయులకు మద్యం, మాంసం అలవాటు చేస్తేనే వారు చెప్పినట్లు వింటారు. లేదంటే కుదరదని తేల్చేసింది దీంతో ఆదివారం సెలవు దినంగా చేసి మద్యం, మాంసం విచ్చలవిడిగా తినాలని సూచించారు. అలా మనకు మద్యం, మాంసం అలవాటు అయ్యాయి. అంతకుముందు భారతీయులు శాఖాహారులే. దీంతో అప్పటి నుంచి మన వారికి మాంసం, మద్యం ఓ వ్యసనంగా మారాయి. దీంతో వారి పని సులువు అయింది.

ఆదివారం అంటే రవివారం. సూర్యుడికి ప్రీతికరమైన రోజు. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడే. అందుకే సూర్యుడి రోజు కొన్ని నిబంధనలు పాటించాలని పురాణాలు చెబుతున్నాయి. అసలు సెలవు రోజు ఉండేది కాదట. పండగల రోజునే సెలవు రోజుగా భావించేవారట. గురుకులాలు ఉండేవి. దీంతో విద్యార్థులు కూడా నియమ నిష్టలతో ఉండేవారు. గురువులపై భక్తి భావం మెండుగా ఉండేది. బ్రిటిష్ వారు మన దేశంలోకి అడుగు పెట్టాక మొత్తం వ్యవస్థే నాశనం అయింది. దీంతో మద్యం, మాంసం రెండు అలవాటు చేయడంతో మన ఆచార వ్యవహారాల్లో తేడా వచ్చింది. దీంతో వారికి కావాల్సిన పని వారు చేసుకుని మనల్ని బానిసలుగా మలుచుకున్నారు .
Also Read: Muslim Schemes in AP: బీజేపీకి కోపం రాకుండా “ముస్లిం పథకాలు” జగన్ నిలిపివేశాడా!?
ఆదివారం మద్యం సేవించకూడదు. మాంసం తినకూడదు. కానీ అవే ప్రధానంగా చేస్తున్నారు. ఇంకా ఆదివారం కురులకు నూనె రాయకూడదు. గోళ్లు తీయకూడదు. నూనె పదార్థాలు భుజించరాదు. ఆడ, మగ కలవకూడదు. ఇన్ని నిబంధనలు పాటిస్తూ మన సనాతన సంప్రదాయం ఎంతో నిష్టలతో ఉండేది. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచినట్లే మన ఆచార వ్యవహారాలను కూడా లేకుండా చేశారు. దీంతో అప్పటి నుంచే మద్యం, మాంసం విచ్చలవిడి అయిపోయాయి. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం దుకాణాల వద్ద క్యూ కడతారు. మద్యం దుకాణాల వద్ద ఎగబడతారు.

సూర్యుడికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం కావడంతో ఆదిత్య హృదయం చదివితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. దీంతోనే ఆదివారం నియమ నిష్టలు పాటించాలని ఉన్నా ఎవరు కూడా వాటిని లెక్కలోకి తీసుకోవం లేదు. వీటిని పాటించనట్లయితే పాపం చుట్టుకుంటుందని తెలిసినా వాటిని వదలడం లేదు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవమే సూర్యుడు. నవగ్రహాలలో మధ్యలో ఉండేవాడు సూర్యుడు. అందుకే నవగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు చేయడం పరిపాటే.
ప్రజల్లో ఉన్న భక్తిని పారదోలేందుకే బ్రిటిష్ వారు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతోనే ఆదివారం మన భక్తి భావం కాస్త రక్తిగా మారడం తెలిసిందే. ఇప్పటికైనా ప్రజలు గమనించి రవివారం ప్రాధాన్యత ఇచ్చి సూర్యుడిని పూజించేందుకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందని గుర్తుంచుకుంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
Also Read:Teachers Assets: టీచర్ల దెబ్బకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అసలు కథ ఇదీ