Homeలైఫ్ స్టైల్Tirumala : తిరుమలకు అస్సలు రావద్దు.. టీటీడీ సంచలన ప్రకటన

Tirumala : తిరుమలకు అస్సలు రావద్దు.. టీటీడీ సంచలన ప్రకటన

Tirumala : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. సాధారణంగా అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. మళ్లీ మళ్లీ భక్తులు వచ్చేలా చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా తిరుమలలో పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే భక్తులను కూడా రావద్దు అంటూ టీటీడీ అధికారులు చెబుతుండడం గమనార్హం.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే జీవితం ధన్యం అవుతుందని భావించే కోట్లాదిమంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఏటా కోట్లాదిమంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని పాప పరిహారం చేసుకుంటుంటారు. అయితే కొద్ది రోజుల నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం తిరుమల లో భక్తుల రద్దీ శనివారం అవుటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు లేని భక్తులు దాదాపు 30 గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి, ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టిటిడి విస్తృత ఏర్పాటు చేసింది. శ్రీవారి సేవకులు భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నారు.

సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు..

భక్తుల సంఖ్య అధికంగా ఉండడం దర్శనం ఆలస్యం అవుతుండడంతో.. ఇబ్బందులు లేకుండా ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టిసారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలు అందిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలోనే శనివారం మధ్యాహ్నం దాదాపు 79 వేల మందికి అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లలో 80 వేలమందికి అన్న ప్రసాదాలతో పాటు ఉప్మా, పొంగల్ పంపిణీ చేశారు.

పిల్లలకు ఇబ్బందులు లేకుండా పాలు పంపిణీ..

దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న వారితో పాటు వచ్చిన పిల్లల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే శనివారం రెట్టింపు సంఖ్యలో అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే క్యూలైన్లలో ఉన్న పిల్లలకు ఎప్పటికప్పుడు పాలను సరఫరా చేస్తున్నారు. ఎటువంటి తొక్కిసిలాట జరగకుండా టీటీడీ, విజిలెన్స్ పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

50 వేల మందికి దర్శన భాగ్యం..

శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్న ప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖలో ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి భక్తులు లక్ష మందికి పైగా ఒకేసారి తిరుమలకు చేరుకోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు ఎవరు తిరుమలకి రావద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version