https://oktelugu.com/

Vegetables: రాత్రి పూట కూరగాయలు అస్సలు కొనొద్దు.. నష్టపోతారు.. కారణం ఇదే..

నేటి కాలంలో ప్రతి ఒక్కరిది బిజీ లైఫే. తాము చేసే పనుల్లో ఏమాత్రం తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతో వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తీసుకొస్తుంటారు. ప్రతిరోజూ కూరగాయలు కొనడం సాధ్యం కాక ఇలా చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 1, 2023 3:36 pm
    Vegetables

    Vegetables

    Follow us on

    Vegetables: మానవ శరీరానికి కూరగాయాలు ఎన్నో పోషకాలు అందిస్తాయి. కొంత మంది మాంసకృతుల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అనుకుంటారు. కానీ కొన్ని వెజిటేబుల్స్ ఉండే పోషకాలు, విటమిన్లు మాంసకృతుల్లో కూడా ఉండవని అంటారు. ప్రతిరోజూ కూరగాయాలతో భోజనం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మంది కూరగాయాలతో భోజనం చేయడానికి ఇష్టపడినా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల తీవ్రగా నష్టపోతున్నారు. దీంతో వాటిలో ఉండే పోషకాలను కోల్పోతూ అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూరగాయలు కొనుగోలు చేయడం వల్ల ఎక్కువగా నష్టపోతారని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రి సమయంలో కూరగాయలు ఎందుకు కొనగోలు చేయొద్దు?

    నేటి కాలంలో ప్రతి ఒక్కరిది బిజీ లైఫే. తాము చేసే పనుల్లో ఏమాత్రం తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతో వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి తీసుకొస్తుంటారు. ప్రతిరోజూ కూరగాయలు కొనడం సాధ్యం కాక ఇలా చేస్తున్నారు. కానీ వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా బంగాళ దుంప, క్యాబేజీ, ఉల్లి వంటి వాటిని తీసుకొచ్చి.. వాటిని కొన్ని రోజుల తరువాత వాడుతున్నారు. ఇలా ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు మాయమవుతాయని అంటున్నారు.

    ఒకేసారి కూరగాయలు కొనుగోలు చేసి ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కూరగాయలు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల పైకి తాజాగా కనిపిస్తున్నా.. అందులో తేమ మాయం అవుతుంది. దీంతో నేచురల్ గా ఉండే ఖనిజాలు,పోషకాలు శరీరానికి అందవు. గది ఉష్ణోగ్రతలో ఉండే కూరగాయలు తినడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. అలాంటప్పుడు వారం రోజులకు ఒకసారి కూరగాయాలు కాకుండా రెండు, మూడు రోజుల కు ఒకసారి కూరగాయలు తీసుకొని వండుకోవాలని అంటున్నారు.

    చాలా మంది ఉదయం విధులకు వెళ్లి రాత్రి లైట్ల వెలుతురులో కూరగాయలు కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని కూరగాయాలు లైట్ల వెలుతురులో తాజాగా ఉన్నట్లు కనిపిస్తాయి. అలా రాత్రి సమయంలో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికొచ్చిన తరువాత అవి పాడైపోవడంతో తీవ్రంగా నష్టపోతారు. పైగా ఉదయం విక్రయం జరగని కూరగాయలు సాయంత్రం విక్రయిస్తుంటారు. ఆకుకూరలు సాయంత్రం వరకు వాటి తేమశాతాన్ని కోల్పోయి డ్రైగా మారుతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఉదయం కూరగాయలు కొనుగోలు చేసేలా ప్లాన్ చేసుకోండి..