With Out Slippers: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి తిండి, సరైన నిద్ర, వ్యాయామం తప్పనిసరి. కొంతమంది అయితే ఈ వ్యాయామం కోసం ప్రతిరోజు సమయం కేటాయిస్తారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలో చాలా మంది రోజూ ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేసేటప్పుడు కాళ్లకు షూ వంటివి ధరిస్తారు. అయితే మనం వాకింగ్ చేసే ప్రదేశంలో రాళ్లు ఉంటే తప్పకుండా షూ ఉండాల్సిందే. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎక్కడికి వెళ్లినా కూడా కాళ్లకు చెప్పులు ధరిస్తారు. ఆఖరికి బాత్రూమ్, ఇంట్లో ఉన్నా కూడా తప్పకుండా చెప్పులు ఉండాల్సిందే. అయితే కాళ్లకు చెప్పులు ధరించి కాకుండా.. నడిస్తే బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెప్పులతో కాకుండా ఉత్తి కాళ్లతో నడవడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉత్తి కాళ్లతో నడవడం వల్ల పాదాల్లో కండరాలకు ఎక్సర్‌సైజ్ అవుతుంది. దీంతో మీ కాళ్లకి ప్రయోజనాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. మరి చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడవడం వల్ల కండరాలు బలపడతాయి. దీంతో ఫ్లాట్ ఫీట్ వచ్చే సమస్య పూర్తిగా తగ్గుతుంది. అలాగే కొందరికి చెప్పులు వేసుకోవడం వల్ల దురద సమస్య ఉంటుంది. అదే చెప్పులు లేకుండా నడిస్తే ఈ సమస్య కూడా ఉండదు. ఉత్తి పాదాలతో నడవడం వల్ల వాటి నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఉత్తి పాదాలతో నడిచేటప్పుడు కొత్తలో కాస్త నొప్పిగా అనిపిస్తుంది. మీకు నడవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని రోజుల పాటు నడిచిన తర్వాత మీరు అలవాటు అయిపోతారు. అయితే చెప్పులు లేకుండా రాళ్లు ఉన్న దగ్గర అసలు నడవకూడదని నిపుణులు చెబుతున్నారు. నడవడానికి అనుకూలంగా ఉండే వాటి దగ్గర మాత్రమే ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే గర్భిణులు చెప్పులు లేకుండా నడవడం వల్ల వ్యాయామం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా నడవడం వల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
ఈ రోజుల్లో అందరూ కూడా చెప్పులతోనే నడుస్తుంటారు. ఇంట్లో ఉన్నా.. ఎక్కడికి వెళ్లిన కూడా చెప్పులతోనే వెళ్తుంటారు. ఒక్క గుడికి వెళ్లినప్పుడు మాత్రమే చెప్పులు లేకుండా దర్శనం ఇస్తారు. అయితే ఇలా చెప్పులు లేకుండా తిరిగితే కొందరు వింతగా చూస్తుంటారు. ఇలా అనుకుంటారని భావించి మీరు చెప్పులతో ఉండవద్దు. మీకు చెప్పులు అవసరం లేని దగ్గర లేకుండా నడవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.