Dipika Pallikal Wins Golds: ప్రతిష్టాత్మక WSF మిక్స్ డ్ డబుల్స్ ఛాంపియన్ విభాగంలో ఇండియా అదరగొట్టేసింది. భారత్ తరఫున ఆడుతున్న దీపికా పల్లికల్ దుమ్మురేపింది. స్క్వాష్ క్రీడా ఈ విభాగంలో ఒకేరోజు ఆమె రెండు గోల్డ్ మెడల్స్ ను సాధించింది. ఆమె భర్త, ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో దుమ్మురేపుతుంటే ఇంకోవైపు దీపికా ప్రపంచ చాంపియన్షిప్ లో ఇండియా పేరు నిలబెట్టింది.

పెళ్లి తర్వాత నాలుగేళ్ళు విరామం తీసుకున్న దీపికా రీ ఎంట్రీ లో అదరగొట్టేసింది. ఆరు నెలల క్రితం ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన దీపికా.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్ కొట్టింది అంటే ఏ రేంజ్ లో కష్టపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. మిక్స్ డ్ డబుల్స్ లో సౌరవ్ గోషల్ తో కలిసి బరిలోకి దిగిన దీపికా.. ఆరంభంలోనే అదరగొట్టేసింది.
Also Read: AP New Cabinet: జగన్ కేబినెట్ లో కొత్త మంత్రులు వీరే.. రాజ్ భవన్ కు జాబితా
ఇంగ్లండ్ కు చెందిన అడ్రియన్ వాలర్, అలిసన్ వాటర్స్ జోడి మీద దీపికా జోడి 11-6, 11-8 తేడాతో నెగ్గింది. రెండో సీడ్ గా బరిలోకి దిగిన దీపికా జోడి.. నాలుగో సీడ్ అయిన అడ్రియన్ జట్టుపై విజయదుందుభి మోగించింది. వరుస షేట్లలో విజయం సాధించింది.

పెళ్లి, ప్రసవం తర్వాత కూడా దీపికా ఈ రేంజ్ లో అదరగొట్టడం అంటే మామూలు విషయం కాదు. పైగా పిల్లలు పుట్టిన ఆరు నెలలకి ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యం అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది క్రీడాకారులు పెళ్లి తర్వాత ఆటకు బ్రేక్ ఇస్తే.. దీపిక ఇన్ని ఏళ్ళు తరువాత రీ ఎంట్రీ ఇచ్చినా కూడా దేశం కోసం ఇంత బాగా ఆడుతుంది అంటూ ప్రముఖులు అభినందిస్తున్నారు.
Also Read:Kavitha: ఢిల్లీలో కేసీఆర్ వెంట కవిత.. ఆ బాధ్యతలు ఆమెకేనా?