Dinner: రాత్రిపూట భోజనం మానేస్తున్నారా.. అయితే ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!

రోజు రాత్రిపూట తినడం మానేస్తే పర్లేదు. కానీ బరువు తగ్గాలని, డైట్ కోసం రాత్రిపూట పూర్తిగా తినడం మానేయడం అసలు కరెక్ట్ కాదు. అసలు రాత్రిపూట తినకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2024 7:24 pm

Dinner

Follow us on

Dinner: వర్క్‌లో బిజీ, బరువు తగ్గాలని కొందరు రాత్రిపూట భోజనం చేయడం మానేస్తారు. దీనివల్ల బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ బరువు తగ్గడం ఆ దేవుడికి ఎరుగు.. అనారోగ్య సమస్యలు మాత్రం తప్పకుండా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా తినకుండా నిద్రపోవడం వల్ల పొద్దున్న వరకు కడుపు ఖాళీగా ఉంటుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నవారు మళ్లీ తర్వాత రోజు ఉదయం వరకు తినకుండా ఉంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఏదో ఒక రోజు రాత్రిపూట తినడం మానేస్తే పర్లేదు. కానీ బరువు తగ్గాలని, డైట్ కోసం రాత్రిపూట పూర్తిగా తినడం మానేయడం అసలు కరెక్ట్ కాదు. అసలు రాత్రిపూట తినకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

రోజులో టిఫిన్, రాత్రి భోజనం అసలు మానకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం పూట టిఫిన్ తప్పకుండా చేయాల్సిందే. రాత్రిపూట తినకుండా నిద్రపోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత అలసట, నీరసంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. రోజూ ఇలానే అయితే నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ ఇలా తినకుండా నిద్రపోవడం వల్ల ఇస్నోమియా బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫుడ్ లేకపోవడం వల్ల నరాలు బలహీనంగా మారుతాయి. చాలా నీరసంగా మారి లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారని నిపుణులు అంటున్నారు. శారీరకంగా లేదా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ తప్పనిసరి. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. శారీరకంగా ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. లేకపోతే కొన్ని సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది.

 

ఎక్కువ సమయం పాటు ఏం తినకుండా ఉంటే గ్యాస్ట్రిక్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కొందరు బరువు తగ్గాలని రాత్రిపూట ఫుడ్ మానేసి, పగలు ఎక్కువగా తింటారు. దీనివల్ల బరువు తగ్గకుండా పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఇలా ఫుడ్ మానడం ఒక్కోసారి మధుమేహానికి కూడా దారితీస్తుంది. రాత్రిపూట తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీటితో పాటు గుండె జబ్బులు రావడం, చర్మం పొడిబారడం, ముఖంపై ముడతలు రావడం, మానసికంగా వేదన చెందడం వంటివి కూడా కనిపిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట తినడం మానేయవద్దు. టిఫిన్ లేదా ఫ్రూట్స్ ఏదో ఒకటి తినడం ఆరోగ్యానికి మంచిది. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా కాకుండా తక్కువగా ఫుడ్ తీసుకోండి. దీంతో బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.