Homeబిజినెస్E- Rupi: ఈ - రూపీ దుమ్ము రేపుతోంది

E- Rupi: ఈ – రూపీ దుమ్ము రేపుతోంది

E- Rupi: అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి బక్క చిక్కుతోంది. నానాటికి కరెన్సీ విలువను కోల్పోతున్నది. ఇప్పటికే జీవితకాల కనిష్టానికి చేరుకుంది. ఈ పతనం ఇంకా ఎందాక కొనసాగుతుందో తెలియదు. మరోవైపు అమెరికన్ ఫెడరల్ బ్యాంకు నానాటికి వడ్డీరేట్లు పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల యూరో, బ్రిటన్ ఫౌండ్ వంటి కరెన్సీలు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఎన్ని విధానాలు చేపట్టినా ఆశించినంత మేర ప్రయోజనాలు దక్కడం లేదు. పైగా ప్రధానమంత్రి మోడీ పనితీరుపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వ మదిలో మిగిలిన ఆలోచన ఈ – రూపీ.. ఇప్పటిదాకా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ మాత్రమే తెలుసు. కానీ ఈ_ రూపీ అంటే మాత్రం తెలియదు. గత అక్టోబర్లో ప్రధానమంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రూపీని ప్రారంభించారు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ విధానం దుమ్మురేపుతోంది.

E- Rupi
E- Rupi

దీనివల్ల వచ్చే మార్పులు ఏంటి

ఈ రూపిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీలతో కలిసి దీనిని రూపొందించింది. ఇది క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ డిజిటల్ పేమెంట్ విధానం ద్వారా వాడుకోగలిగే ప్రీపెయిడ్ వోచర్. క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ బేస్డ్ ఈ వోచర్ యూజర్ మొబైల్ కి వస్తుంది. ఎటువంటి కార్డు గాని, డిజిటల్ పేమెంట్స్ యాప్ గాని, నెట్ బ్యాంకింగ్ గాని లేకుండా పేమెంట్స్ చేయొచ్చు.. సర్వీస్ ప్రొవైడర్, యూజర్కు డైరెక్టుగా ఎటువంటి కాంటాక్ట్ లేకుండానే దీనిని వాడుకోవచ్చు. ముందే పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరి మధ్య లావాదేవీలు పూర్తయిన తర్వాత కస్టమర్ నుంచి సర్వీస్ ప్రొవైడర్ కు మన ఈ_ రూపీ చేరి పేమెంట్ పూర్తవుతుంది. అప్పటివరకు అది హోల్డ్ లోనే ఉంటుంది. ఈ_ రూపీ తీసుకునేందుకు ముందుగా పేమెంట్ చేసి ఉండడం వల్ల దీనిని సర్వీస్ ప్రొవైడర్లకు పంపే విషయంలో ఈ బెనిఫిట్ కలుగుతుంది. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ విషయంలోనూ జరగకుండా చూడొచ్చు. మాతృ, సంక్షేమ పథకాలు, టీబీ నివారణ కార్యక్రమాలు, డయాగ్నస్టిక్ స్కీమ్స్ లాంటి వాటి కింద అందించే మందులు, పౌష్టికాహారం వంటి సేవలు అందించేందుకు కూడా కేంద్రం ఈ _ రూపిని వాడుతుంది. ఆయుష్మాన్ భారత్, ఎరువుల రైతుల వంటి వాటికి కూడా ఉపయోగిస్తుంది. ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ లాంటి వంటి వాటికి ప్రైవేట్ కంపెనీలు కూడా దీనిని వాడుకోవచ్చు. ఈ రూపీ విధానంలో పేమెంట్స్ చాలా సులభంగా, సెక్యూర్డ్ గా చేయొచ్చు. యూజర్ల ప్రైవసీ కూడా దెబ్బతినకుండా ఉంటుంది.

కార్పొరేట్లకు సులభతరంగా

కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన స్కీమ్స్ విధానంలో అందించవచ్చు. ఈ వోచర్ రీడిమ్ చేసుకున్నారా లేదా అన్నది ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ లెస్ ఓచర్ను ఫిజికల్ గా ప్రింట్ రూపంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సెక్యూర్ -2 స్టెప్ వెరిఫికేషన్ తో సేఫ్ గా, ఈజీగా రిడీమ్ చేసుకోవచ్చు. యూజర్లకు ఎటువంటి వ్యక్తులు సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్ కు షేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రైవసీ విషయంలో పెద్దగా భయం ఉండదు. ఈ వోచర్లు రిడీమ్ చేసుకునేందుకు కస్టమర్ కు డిజిటల్ పేమెంట్ యాప్ గాని, బ్యాంకు అకౌంట్ గాని అవసరం లేదు.

ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల ద్వారా ఈ_ రూపీని తీసుకోవచ్చు.

E- Rupi
E- Rupi

పైలట్ ప్రాజెక్టులో దుమ్మురేపింది

నవంబర్ 1 నుంచి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈ రూపీని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. సి బి డి సి తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీ తొలి ప్రాజెక్టును మరో నెలలో ప్రారంభిస్తుంది.. తొలి విడుదల ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు, కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూపులకు మాత్రమే డిజిటల్ రూపాయి ద్వారా రిటైల్ లావాదేవీలు జరిపే అవకాశం బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్మెంట్ యూజ్ కేసును కూడా ప్రవేశపెట్టింది. అయితే దీనివల్ల సిబి డి సి ల్లో సెటిల్మెంట్ ద్వారా లావాదేవీల వ్యయం కూడా తగ్గింది. ఈ రూపి ద్వారా మార్కెట్ లావాదేవీలు జరిపేందుకు సి బి డి సి మరో ప్రత్యామ్నాయం కావడంతో డిజిటల్ రూపాయి దుమ్ము రేపుతోంది. అయితే ఇది అమలులోకి వచ్చిన తర్వాత భౌతిక కరెన్సీ ఉంటుందా లేదా అనే సందేహం ప్రజల్లో ఉంటుంది. అయితే అవి కూడా చలామణిలో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ తన కాన్సెప్ట్ నోట్ లో వివరించింది. కాగా పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ రూపీ విధానం త్వరలో దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular