Benefits Of Walking: మనదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. చిన్న వయసులోనే షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన శైలి రోగాలకు మూలకారణం అవుతోంది. దీంతో దేశం డయాబెటిస్ కు రాజధానిగా మారుతోంది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువగా మధుమేహం వ్యాపించడానికి కారణాలవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా మనదేశంలోనే షుగర్ వ్యాధి ప్రబలంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది దాని బారిన పడుతూ జీవితాంతం కష్టాలు అనుభవిస్తున్నారు.

మధుమేహం వస్తే ఇక మన శరీరం గుల్ల కావాల్సిందే అని అనవసర భయాలు పెట్టుకోవద్దు. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే ఏ సమస్యలు రావు. వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ముప్పు రాదని తెలుసుకోవాలి. షుగర్ ను అదుపులో ఉంచుకునే క్రమంలో ప్రతి రోజు రెండుపూటల నడక మంచిదే. వాకింగ్ తో చాలా ప్రయోజనాలు మనకు ఉన్నాయని తెలుసుకుంటే మంచిది. ప్రతి రోజు రెండు పూటల వాకింగ్ చేస్తే షుగర్ కచ్చితంగా నియంత్రణలో ఉండటం తెలిసిందే.
Also Read: Vastu Shatra: వాస్తు శాస్త్రంలో ఉత్తర దిక్కు ప్రయోజనమేమిటో తెలుసా?
రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ రాత్రి పూట భోజనం చేసిన తరువాత కూడా ఓ పదిహేను నిమిషాల నుంచి అరగంట లోపు నడక కొనసాగిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతాయని ఆధారాలు చెబుతున్నాయి. అందుకు రాత్రి భోజనం తరువాత నడక నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో రాత్రి పూట భోజనం చేశాక మనం నడిచే నడకతో ఎంతో ప్రయోజనం ఉందని తెలుస్తోంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునే క్రమంలో నడక మంచి ఔషధంగా ఉపయోగపడనుందని చెబుతున్నారు.

భోజనం చేసిన తరువాత మధుమేహ వ్యాధిగ్రస్తులు నడక కొనసాగిస్తే ఎంతో ప్రయోజనం దక్కుతుందని తెలుస్తోంది. 12 శాతం షుగర్ స్థాయిలు తగ్గుతాయని తెలుస్తోంది. అందుకే సాయంత్రం భోజనం తరువాత షుగర్ పేషెంట్లు నడక సాగించాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటోందని ఫలితాలు తెలియజేస్తున్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోగులు తగు జాగ్రత్తలు తీసుకుని బ్లడ్ షుగర్ ను కట్టడి చేసుకునేందుకు అవలంబించే మార్గాల్లో నడక ప్రధానమైనదిగా గుర్తిస్తున్నారు.
Also Read:Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండి అసలు సంగతి ఇదే !