
Health Tips: ప్రస్తుతం చాలా మంది ధూమపానం, మద్యపానానికి అలవాటు పడిపోయారు. ఆ అలవాట్ల నుంచి దూరం కాలేకపోతున్నారు. ఇంకా బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఫలితంగా ఎన్నో సమస్యలకు కారణంగా నిలుస్తున్నారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు.
ధూమపానంతో..
ధూమపానంతో చాలా సమస్యలొస్తాయి. ఊపిరితిత్తులు పాడైపోతాయి. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. దీంతో రొమాన్స్ సరిగా ఆస్వాదించలేరు. ధూమపానంతో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా ఎవరు మానడం లేదు. రోజు ధూమపానంతో తమ అవయవాలపై ప్రభావం చూపుతున్నా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు.
లైంగిక సామర్థ్యంపై..
పొగతాగడం వల్ల లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. ముందు ఉన్న పరిస్థితి ఉండదు. అంగం సరిగా స్పందించదు. ఫలితంగా జీవిత భాగస్వామికి ఇబ్బందులు ఎదురవుతాయి. ధూమపానంతో ఊపిరితిత్తుల్లో పొగ పేరుకుపోవడంతో శ్వాస సంబంధమైన జబ్బులు వస్తాయి. దీని వల్ల మన దేహం ఎన్నో సమస్యలకు నిలయంగా మారుతుంది.

రక్తసరఫరాకు..
శరీరంలో నిత్యం రక్త సరఫరా సక్రమంగా జరిగితేనే అన్ని అవయవాలు పనిచేస్తాయి. రక్తనాళాలల్లో రక్తం సరిగా సరఫరా అయితేనే మనకు లైంగికతపై ఆసక్తి పెరుగుతుంది. తద్వారా అంగం త్వరగా స్తంభిస్తుంది. అంతేకాని పొగ తాగితే లైంగికతపై పెనుప్రభావం చూపుతుంది. దీని వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. దీంతో ధూమపానానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.