Soft Drinks Effects: శీతల పానీయాలు అత్యంత ప్రమాదకరం. వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందులో పురుగుల మందు కలుపుతారు. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మనిషి ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
కూల్ డ్రింక్స్ తాగడం మంచి అలవాటు కాదు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. తాజాగా జరిపిన ఓ పరిశోధనలో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వివిధ జబ్బులతో చనిపోయినట్లు కనుగొన్నారు. దీంతో కూల్ డ్రింక్స్ తాగడం మంచి అలవాటు కాదు. ఇందులో కలిపే చక్కెర వల్ల మన అవయవాలు దెబ్బతింటాయి.
దీని గురించి తెలిసినా ఎవరు కూడా మానడం లేదు. వీటిని తాగేందుకే మొగ్గు చూపుతుంటారు. వీటికి బదులు కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ చల్లగా తియ్యగా ఉండటంతో గొంతుకు హాయిగా అనిపిస్తుంది. కానీ విషం తాగుతున్నామని తెలుసుకోవడం లేదు. ఎన్నో పరిశోధనలు కూల్ డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని చెబుతున్నారు.
శీతల పానీయాలు తాగొద్దని ఎంత మంది చెబుతున్నా లెక్కలోకి తీసుకోవడం లేదు. రోజు ఓ రెండు గ్లాసుల శీతల పానీయాలు తాగితే అందరికంటే పదేళ్లు ముందుగానే మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయినా ఎవరు కూడా కూల్ డ్రింక్స్ తాగడం మానడం లేదు. అదే అలవాటును కొనసాగించడం గమనార్హం.