Dasara: దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు ఉల్లాసంగా గడిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆయుధ పూజలు నిర్వహించారు. వాహనాలు ఉన్నవారు ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేశారు. పోలీస్ స్టేషన్లో.. వ్యాపార సముదాయాల్లో ఆయుధపూజ చేశారు. ఆ తర్వాత శమీ పూజలో పాల్గొన్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా చాలామంది నాన్ వెజ్ తీసుకున్నారు. గాంధీ జయంతి అయినప్పటికీ ముందు రోజే నాన్ వెజ్ కొనుగోలు చేసి ఫ్రిజ్లో ఉంచుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి నాన్ వెజ్ వంటకాలను ఆరగించారు. అయితే ఈ సమయంలో జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నాన్ వెజ్ బాగా తిన్న తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే?
దసరా పండుగ సందర్భంగా కొందరు నాన్ వెజ్ తో పాటు మద్యం కూడా తీసుకున్నారు. అయితే నాన్ వెజ్ తో కలిపి మద్యం తీసుకున్న వారిలో డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పిగా ఉండడం.. శరీరం బరువుగా అనిపించడం. ఏ పని చేయడానికి ఉత్సాహంగా లేకపోవడం అంటూ ఉంటాయి. నిన్న మధ్యాహ్నం సేవించిన వారిలో ఈరోజు ఉదయం ఆలస్యంగా లేచే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి ఉత్సాహంగా అనిపించదు.
అయితే ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ఈరోజు ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫైబర్ లేదా తీసుకోవాలి. ప్రో బయోటిక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా నాన్ వెజ్ తిన్న మరుసటి రోజు మరోసారి నాన్ వెజ్ తినకుండా లైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి. దీంతో శరీరంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాకుండా కొందరు మద్యం ఎక్కువగా సేవించే వారికి ఈరోజు ఉదయం హాంగోవర్ కు గుర అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివారు నీరు ఎక్కువగా తీసుకుంటూ.. సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోవాలి. నా చేయడం వల్ల కొత్త రకమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక చాలామంది వరుసగా మద్యం సేవించాలని అనుకుంటారు. కానీ అలా చేయడంవల్ల శరీరంలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండి తల భారంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తలనొప్పి తీవ్రంగా ఉంటూ ఏ పని చేయడానికి ఉత్సాహం అనిపించదు. అందువల్ల సాధ్యమైనంతవరకు ఈరోజు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ మాత్రమే ఉండాలి.