
Dhoni Practice : జార్కండ్ డైనమైట్ అనగానే క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చేది మహేంద్రసింగ్ ధోనీ.. టీమిండియా క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధోనీ.. ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఐపీఎల్‌లో చెనై్నకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ధోనీ టీమిండియాలో ఉన్నా.. ఐపీఎల్ ఆడినా ఆయన క్రేజీ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. మైదానంలోకి దిగితే చాలు.. మైదానం మార్మోగాల్సిందే.. హెలిక్యాప్టర్ షాట్స్ స్పెషలిస్ట్ అయిన ధోనీ గ్రౌడ్‌లో అడుగు పెడితే.. సిక్సర్ల మోత మోగాల్సిందే. ఇదే ఆయనకు లక్షల మందిని అభిమానిని చేసింది.
ప్రాక్టీస్‌లోనూ అదే హోరు..
16 సీజన్ ఐపీఎల్ సీజన్ ఈనెల 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్సై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రాక్టిస్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా అభిమానులు ‘ధోనీ నామస్మరణ’తో మార్మోగింది. అట్లుంటది ధోనీతోని అన్నట్లుగా ప్రాక్టీస్‌లోనూ ధోనీ మోనియా కొనసాగింది.
గేమ్ చేంజర్..
19 ఏళ్ల కిందట 2004 డిసెంబర్‌లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. క్రమంఒగా అన్ని రకాలుగా జట్టులో సెటిల్ అయిపోయాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఎలాంటి పొరపాట్లు చేయలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగకు పంపిస్తే.. వన్డేలో సెంచరీ బాదాడు. అలాగే టెస్టులోనూ 85 పరుగులు సాధించాడు. చాలా అద్భుతంగా ఆడటంతో ఒక్కసారిగా బ్రాండ్‌గా మారిపోయాడు. ధోనీ.. టీమిండియాకు ఆడినా.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నా ఆయనకు గేమ్ చేంజర్‌గా గుర్తింపు ఉంది. ఓడిపోయే మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు ధోనీ. టీ20తోపాటు ఐపీఎల్‌లో కూడా చెన్సై జట్టును నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత కూడా ధోనికి ఉంది. ఇక ఐసీసీ వరల్డ్‌కప్ భారత్‌కు అందించిన రికార్డు కూడా ధోనీ పేరిట ఉంది. అందుకే ధోనీ గేమ్ చేంజర్‌గా పేరు తెచ్చుకున్నారు.
Nayagan meendum varaar… 💛🥳#WhistlePodu #Anbuden 🦁 pic.twitter.com/3wQb1Zxppe
— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023