Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు ఏం జరిగిందంటే.. ఆనందరావు కు అనారోగ్య సమస్య ఉండటం తో సౌందర్య డాక్టర్ భారతి ని పిలిపించి చూపిస్తుంది. దీనికి ఒకటే మార్గం హాస్పిటల్ లో చేర్చడమే కరెక్ట్ అని అంటుంది. మరోవైపు కార్తీక్ పిండి వంటలు ప్యాక్ చేస్తూ ఉంటాడు. దీప వచ్చి ఎందుకిలా చేస్తున్నారు కార్తీక్ బాబు.. మీకు ఎందుకు ఇంత శ్రమ అని ఉంటుంది.
కార్తీక్ ఏం కాదు అంటూ నేను కూడా నీతో పిండివంటలు అమ్మడానికి వస్తాను అని అంటాడు. ఇక కార్తీక్ ఒంటరిగా రోడ్డుపై గతంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని ఒకే సారి గట్టిగా అరుస్తాడు. అదంతా దీప గమనించి అక్కడికి వెళ్లి కార్తీక్ కు నచ్చజెప్పి ధైర్యం చెబుతుంది. పిల్లలకు టిఫిన్ బాక్స్ ఇవ్వమని అంటుంది.
ఇక మోనిత సౌందర్య చేస్తున్న ఎంక్వైరీ గురించి ఆలోచిస్తూ సౌందర్యను తక్కువ అంచనా వేయొద్దని అనుకుంటుంది. అంతలోనే తనకు ఒక విన్నీ అనే ఒక యువతి ఫోన్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ విన్నీ అనే కొత్త క్యారెక్టర్ ను ప్లాన్ చేసి పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక సౌందర్య ఆనందరావు ఆరోగ్యం గురించి ఆదిత్యతో చెబుతూ బాధపడుతుంది. ఆదిత్య సౌందర్య కు ధైర్యాన్ని ఇస్తాడు.
దీప పిండి వంటలు అమ్మడానికి ఏ షాప్ కు వెళ్ళిన ఎవరు తీసుకోరు. అప్పటికే రుద్రాణి వాళ్ళందరికీ అమ్మడంతో దీప వ్యాపారానికి అడ్డుగా ఉంటుంది. కార్తీక్ పిల్లల కోసం భోజనం తీసుకొని వెళుతుండగా భోజనం కింద పడిపోవడంతో కార్తీక్ బాధపడతాడు. తరువాయి భాగం లో రుద్రాణి దీప పై అరుస్తూ ఉండగా.. వెంటనే దీప చేతిని లేపి రుద్రాణి కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్పు ఎవరు తీరుస్తారు అని అడగటంతో దీప నేనే తీరుస్తాను అని గట్టిగా చెబుతోంది.