Onion – Sleep : ఉల్లితో గాఢ నిద్ర.. ఏం చేయాలంటే?

ఉల్లి, తేనె మిశ్రమాన్ని నిత్యం తీసుకోవడం ద్వారా మన మెదడులో మెలోటిన్‌ ఉత్పత్తి పెరుగుతుందట. నిద్ర మంచిగా పట్టడానికి ఉపయోగపడే రసాయనం మెలోటిన్‌. ఇది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే అంతగా నిద్ర పడుతుంది. నిద్ర పట్టడం లేదని వైద్యుడి వద్దకు వెళితే అతను కూడా మెలోటిన్‌ ఉత్పత్తి అయ్యే మందులే ఇస్తాడు. సహజమైన, నిత్యం ఇంట్లో ఉండే ఉల్లి, తేనె మిశ్రమం తీసుకుంటే అంతకన్నా ఎక్కువగా మెలోటిన్‌ ఉత్పత్తి అవుతుందట. షుగర్‌ ఉన్నవారు తేనె కలుపకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Written By: NARESH, Updated On : March 13, 2024 1:17 pm

Deep sleep with onion

Follow us on

onion – Sleep : నిద్ర ప్రతీ మనిషి జీవితానికి చాలా ముఖ్యం. అయితే పెరుగుతున్న ఉరుకులు పరుగుల జీవితంతో, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా ప్రస్తుత సమాజంలో నిద్ర కరువవుతోంది. కానీ, ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అయితే చాలా మంది నిద్ర కోసం వైద్యులను సంప్రదించి మందులు వాడుతున్నారు. అయితే తాత్కాలికంగా ఇవి సమస్యకు పరిష్కారం చూపినా దీర్ఘకాలికంగా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎక్కువగా నిద్రమాత్రలు వాడితే శరీరం దానికి అలవాటు పడుతుందని, కిడ్నీ, గుండె సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజమైన నిద్రతో మానసిక ప్రశాంతత, శరీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు.

ఉల్లితో సహజ నిద్ర..
తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అనేది సామెత. వేసవిలో శరీర చల్లదనానికి ఉల్లిపాయ దోహదం చేస్తుంది. శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఉల్లితో గాఢ నిద్ర కూడా పడుతుందని నిపుణులు పేర్కంటున్నారు. చిన్న చిట్కాతో సహసమైన ఆరోగ్యకరమైన నిద్ర పోవచ్చని సూచిస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత, సుఖమైన వైవాహిక జీవితం కూడా ఉండాలని సూచిస్తున్నారు.

ఉల్లి ఎలా తీసుకోవాలి…
ఇక ఉల్లిగడ్డతో గాఢ నిద్ర రావాలంటే దానిని తీసుకునేందుకు కొన్ని పద్ధతులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు దీనిని తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అంటే 25 గ్రాముల నుంచి 50 గ్రాములలోపు ఉండాలి. దీనిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఆముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని దానికి 10 నుంచి 15 గ్రాముల తేనెను యాడ్‌ చేయాలి. ఈ రెండింటిని బాగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇక నిద్రకు ఉపక్రమించే ముందు దీనిని సేవించాలి. ఇలా ప్రతీరోజు తీసుకోవడం వలన సహజమైన గాఢ నిద్ర వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఉల్లితో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని పేర్కొంటున్నారు. నిత్ర మాత్రలు మానేసి ఈ పదార్థం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు.

మెలోటిన్‌ ఉత్పత్తి..