David Warner: ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీని కోసం ఫ్రాంచైజీలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విజయం కోసం ఆటగాళ్లను మార్చుకుంటున్నాయి. ఇన్నాళ్లు తమ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లను వదిలేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్ల జాబితా ప్రకటించేందుకు సన్నద్దమవుతున్నాయి. 2022 మెగా ఐపీఎల్ నిర్వహణకు ముందుకు వచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఆటగాళ్ల వేలం వేయడానికి తయారవుతోంది.

అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ లను వదిలేసేందుకు నిర్ణయించుకుంది. దీంతో వారికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో వీరి కోసం పలు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నట్లు సమాచారం. 2016లో ఫ్రాంచైజీకి తొలి ట్రోఫీని అందించిన వార్నర్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. సన్ రైజర్స్ మాత్రం మంచి ఆటగాళ్లను దూరం చేసుకుందనే ప్రచారం సాగుతోంది.
Also Read: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం
ఈ సీజన్ లో వార్నర్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు కూడా ఆసక్తిగా ఉండటంతో ఆర్సీబీ వార్నర్ ను తమ జట్టులోకి తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి రాయల్ చాలెంజర్స్ ఓ మంచి ఆటగాడిని తమ జట్టులోకి తీసుకుని విజయాలు నమోదు చేయాలని భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఐపీఎల్ 2021 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో వార్నర్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఆర్సీబీ నిర్ణయంతో అందరిలో ఆసక్తి కలుగుతోంది. వార్నర్ రాకతో ఆర్సీబీ పటిష్ట స్థితికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా..?