Dark Underarms: మంచి డ్రెస్ వేసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అయితే అది సూట్ అయితే ఎలాంటి నష్టం లేదు. కానీ కొన్ని సార్లు డ్రెస్ లు సూట్ అయినా సరే మన శరీర అవయవాలు మాత్రం ఇబ్బంది పెడతాయి. చాలా మందికి స్లీవ్ లెస్ వేసుకోవాలి అనిపిస్తుంది. కానీ చంకల నలుపు వెక్కిరిస్తుంది. కనీసం లూజ్ గా ఉండే హాండ్స్ కుట్టించుకుందాం అనుకున్నా సరే ఈ నలుపు వల్ల ఎగతాళి చేస్తారు అని ఆ ఆలోచన కూడా చేయరు చాలా మంది. కానీ ఈ చంకల నలుపు మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతుంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న రెమెడీలను ఉపయోగిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. మరి ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం పదండీ..
నిమ్మకాయ – పసుపు: నిమ్మకాయ, పసుపు చర్మాన్ని లోపలి నుంచి ప్రకాశవంతం చేస్తాయి. ఒక టీస్పూన్ పసుపులో కొన్ని చుక్కల నిమ్మకాయ కలపండి. ఈ పేస్ట్‌ను అండర్ ఆర్మ్స్‌పై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి 3 సార్లు వాడండి. ఇది నల్లదనాన్ని తొలగించడమే కాకుండా, చర్మాన్ని తాజాగా, బిగుతుగా చేస్తుంది. ఓ సారి ఈ రెమెడీని పాటించండి. మంచి ఫలితాలను చూస్తారు.
Read Also: ఒక్క ఫోన్ చాలు మీ భాగస్వామి ఇల్లీగల్ రిలేషన్ తెలియజేయడానికి. మీరు ఎలా తెలుసుకుంటారంటే?
రోజ్ వాటర్: బేకింగ్ సోడాలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ తో మీ అండర్ ఆర్మ్స్ ని 2 నిమిషాలు స్క్రబ్ చేసి, తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ పద్ధతి క్రమంగా నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.
దోసకాయ: దోసకాయను మెత్తగా చేసి దాని రసాన్ని తీసి, కాటన్ తో చంకల మీద అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ప్రతిరోజూ దీన్ని అప్లై చేయడం వల్ల చర్మపు రంగు కాంతివంతంగా మారుతుంది.
అలోవెరా జెల్: తాజా అలోవెరా జెల్ ను చర్మానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది చర్మం సహజ రంగును పునరుద్ధరిస్తుంది. మృదుత్వాన్ని కూడా పెంచుతుంది.
Read Also: వైసీపీకి షాక్.. ఆ రెండు పదవులు పోయినట్టే!
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో విటమిన్ E క్యాప్సూల్ కలిపి రాత్రి పడుకునే ముందు చంకల మీద రాయండి. ఇది చర్మాన్ని రిపేర్ చేసి, తిరిగి మెరుపును తెస్తుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ లో ఒక చెంచా చక్కెర కలిపి 2 నిమిషాలు స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయండి, మీరే తేడాను చూస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.