Dark Circles Under Your Eyes: కంటి కింద నల్లటి డార్క్ సర్కిల్స్ ఉంటే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఫలానా క్రీమ్ అప్లై చేసి.. ఆ డార్క్ సర్కిల్స్ ను హాయిగా పోగొట్టుకోండి అంటూ తెగ యాడ్స్ వస్తూ ఉంటాయి. అయితే.. ఎన్ని క్రీమ్ లు రాసినా అవి మాత్రం పోవు. మరి అప్పుడు ఏమి చేయాలి ? ఏం చేస్తే.. మన కళ్ళు అందంగా ఉంటాయి. వాటికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని సింపుల్ గా ఫాలో చేస్తే చాలు. మన కళ్ళు ఎంతో అందంగా తయారవుతాయి.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోగొట్టే బెస్ట్ మార్గాలు ఇవే !
ఫ్రిజ్‌లో పెట్టిన కీరదోస ముక్కలను పావుగంట కళ్లపై పెట్టుకుంటే చాలు.. ఆ డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.
అలొవెరా జెల్ ను కళ్ల కింద రాసి.. కాసేపటి తర్వాత కడిగేయండి. అప్పుడు కూడా ఆ డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.
టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేస్తే చాలు.. డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. .
లేదా, టొమాటో ముక్కలను కళ్లపై పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుందని వైద్యలు చెబుతూ ఉంటారు.
వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్‌ని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత కళ్లపై పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోతాయి.
Also Read: Weight Loss: బరువు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఇవే బెస్ట్ మార్గాలు !
అదే విధంగా బంగాళదుంప కూడా కళ్ళకు చాలా మేలు చేస్తోంది. ముందుగా బంగాళదుంపలను సన్నగా తరిగి బాగా చక్కగా జ్యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ దూదిని కాటన్ బాల్స్ లా చేసి ఆ జ్యూస్‌లో ముంచి.. ఇక కళ్లు మూసుకొని ఆ కాటన్ బాల్స్‌ను కళ్ల మీద పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోతాయి.
Also Read: Baby Care: మీ పిల్లలు జలుబుతో బాధ పడుతున్నారా.. సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!