Plastic Bottle: వేసవి కాలం వచ్చేసంది. ఎండలు ముదురుతున్నాయి. వేడికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఎండ ప్రభావంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ కాలంలో నీరు కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. లేదంటే బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. వడదెబ్బ సోకితే ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఒకవేళ తిరిగితే నీరు ఎక్కువగా తీసుకోవాలి.

అయితే నీరును ఎందులో నిలువ చేసుకోవాలి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళితే మనం ప్లాస్టిక్ బాటిల్ లో నీరు నిలువ చేసుకుని వెళతాం. ఇంట్లో ఉంటే మాత్రం కుండలో నీరు తాగుతాం. ఇక ఫ్రిజ్ ఉన్న వారు అందులోని నీరు తాగుతారు. కానీ ప్లాస్టిక్ బాటిల్ అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్ వినియోగం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకు వాటిని ఉపయోగించడం మంచిది కాదనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
Also Read: Old TV Anchors: ఒకప్పటి ఈ బుల్లితెర యాంకర్స్ గుర్తున్నారా.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..
మెటాలిక్, రాగి, ఇత్తడి తదితర వాటితో చేసిన వాటిని వినియోగించుకోవాలి. అంతేకాని ప్లాస్టిక్ బాటిళ్లను వాడకూడదు. ఒకవేళ వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుస్తోంది. ఎండ వేడికి ప్లాస్టిక్ లోని డయాక్సిన్ నీటిలోకి విడుదలై తద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లను వీలైనంత వరకు దూరం ఉంచడమే మంచిది. దీని వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పీసీవోఎస్, ఓవరీస్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరతాయని వైద్యులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగితే వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. మగవారిలో శుక్రకణాలు తగ్గుతాయి. కాలేయ క్యాన్సర్ రావొచ్చు. డయాబెటిస్, ఒబెసిటీ, సంతాన సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఇన్ని రకాల వ్యాధులు వస్తాయి కాబట్టే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం అంత మంచిది కాదనే సూచిస్తున్నారు. మనం కూడా మేల్కొని వాటిని సాధ్యమైనంత వరకు దూరం చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నీరు కూడా వేడి కాకుండ చూసుకోవాలి. ఎండలో ఉన్న నీటిని తాగకూడదు. దాని వల్ల కూడా అనర్థమే. ఎప్పుడు 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దాటకుండా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందే. ప్లాస్టిక్ బాటిళ్లను దూరం చేసి గ్లాస్, మెటల్ తో చేసినవి వాడితే ప్రయోజనం. ప్లాస్టిక్ బాటిళ్లను వాడకుండా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎవరైనా ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతూ కనిపిస్తున్నారు. భవిష్యత్ లో కలిగే దుష్ర్పయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాగి పాత్రలు వాడితే మంచిది.
Also Read:Somu Veerraju: ‘శక్తి’ని కూడగడుతున్న సోము వీర్రాజు…బీజేపీ బలోపేతానికి పక్కా స్కెచ్