Dak Sewa App: ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని చేరవేయడానికి భారతదేశంలో పోస్టల్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు మనుషుల మధ్య కమ్యూనికేషన్స్ కోసం ఉత్తర, ప్రత్య ఉత్తరాలు ఎక్కువగా చేసుకునేవారు. దేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1764లో బొంబాయిలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కంపెనీ మెయిల్ పేరుతో దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను ప్రారంభించారు. 1854లో పూర్తిగా పోస్టల్ చేయాలని ప్రారంభించి ప్రజలు ఉత్తరాలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండియన్ పోస్ట్ గా పిలవబడుతుంది. అయితే కాలక్రమమైన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కమ్యూనికేషన్ కోసం రకరకాల సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్ట్ ఆఫీస్ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య తగ్గింది. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోస్టల్ సేవలను ఆన్లైన్ చేయనున్నారు. ఇందులో భాగంగా కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ యాప్ పేరు డాక్ సేవ.. మరి దీని గురించి వివరాలు లోకి వెళ్తే..
పోస్టల్ వినియోగదారులు తమ కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి ఇండియన్ పోస్ట్ డాక్ సేవ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ లెటర్స్, మనీ ఆర్డర్స్ ట్రాకింగ్ నో రియల్ టైం లో తెలుసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ పార్సిల్ సర్వీస్కు ఎంత తేడా ఉందో కూడా గుర్తించవచ్చు. దీని ద్వారా పోస్టల్ సేవలకు ఇష్టపడేవారు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే యాప్ లోనే స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ చేసుకోవచ్చు. మనీ ఆర్డర్ పార్సిల్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. దీంతో పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లకుండానే ఉన్నచోటే సేవలను పొందవచ్చు.
పోస్టల్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ఈ యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ లకు సంబంధించి సేవలను ఏవైనా పొందాలని అనుకుంటే లేదా సేవలో ఏదైనా అంతరాయం కలిగితే ఈ యాప్ ద్వారానే ఫిర్యాదు చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఇందులో ఉన్న జిపిఎస్ ఆప్షన్ ద్వారా పోస్ట్ ఆఫీస్ లొకేషన్ గుర్తించవచ్చు. సమీపంలో పోస్ట్ ఆఫీస్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. చాలామంది పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. ఇలాంటి అవకాశాన్ని కూడా ఈ యాప్ ఇస్తుంది. ఉన్నచోటే వెంటనే పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కార్పొరేట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లాజిస్టిక్స్, కాంట్రాక్టు మేనేజ్మెంట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
రూరల్ ప్రాంతాల్లోని వారికి సేవలను అందించే ఉద్దేశంతో పాటు, పోస్టల్ సేవలను భారతీయులందరికీ పరిచయం చేసే ఉద్దేశంతో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రస్తుతం డిజిటల్ మయం కావడంతో పోస్ట్ ఆఫీస్ సేవలు కూడా ఆన్లైన్ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ లో ఏదైనా సేవల కోసం క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇకనుంచి ఈ యాప్ ద్వారా అన్ని కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.